ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బాబు కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 71వ వసంతంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు విద్యార్థి దశ నుండే రాజకీయాలను అలవర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అడుగులు వేసిన చంద్రబాబు ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టాక అందులో జాయిన్ అయి తరువాత ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహమాడటం జరిగింది. అనతికాలంలోనే పార్టీలో కీలక నాయకుడిగా చంద్రబాబు రాణించడం జరిగింది. పార్టీ సంక్షోభంలో ఉన్న టైంలో చంద్రబాబు వేసిన అడుగులు టిడిపి పార్టీ ని నిలబెట్టాయి అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అప్పట్లో ఉన్న వారు అంటుంటారు.

 

అపర చాణక్యుడిగా మంచి తెలుగు రాజకీయాల్లో పేరున్న చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎంత పేరు ఉన్న చంద్రబాబు లో కొన్ని మైనస్ లు ఏపీ రాజకీయాల్లో వినబడతాయి. ఎక్కువగా వినబడే మైనస్ ఏమిటంటే..చంద్రబాబుకి వ్యవసాయం అంటే ఇష్టం ఉండదని, అదేవిధంగా దళితులంటే ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తారని అంటుంటారు.

 

ముఖ్యంగా ప్రజలకు హామీలు ఇచ్చే విషయంలో ఇష్టానుసారంగా ఇచ్చి తర్వాత నెరవేర్చే దాన్ని టైంలో మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారని అదొక్కటే దెబ్బ కొట్టేసింది అని చాలామంది ప్రత్యర్థులు చెబుతుంటారు. 2014 ఎన్నికల టైంలో రైతు రుణమాఫీ, కాపులను బీసీల్లో చేరుస్తాను అని ఇచ్చిన హామీ గాని ఇప్పటి వరకూ చంద్రబాబు నెరవేర్చలేక పోయారని… విశ్వసనీయత లో చంద్రబాబు ప్రజల మన్నలను పొందుకో లేకపోవడంతో గత సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం జరిగిందని చాలా మంది రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తుంటారు. అంతేకాకుండా వ్యవస్థలను మీడియా మేనేజ్ చేయాలంటే దేశంలో చంద్రబాబు తర్వాతే మరెవరైనా అని చాలా కాన్ఫిడెంట్ గా ప్రత్యర్థులు బాబు గురించి చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: