కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కామన్ గా ఏర్పడిన ప్రాబ్లం ఏమిటంటే ఆర్థికమాంద్యం నష్టపోవడం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మందులేని కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేయటంతో ఆర్థికంగా బాగా నష్టపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కడికక్కడ లావాదేవీలు ఆగిపోయాయి. చాలావరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లు నిరుద్యోగం, ఆహారం. అయితే ప్రత్యేకంగా ఇండియా సెపేరేట్ గా ఎదుర్కొంటున్న పెను సవాల్ ఏమిటంటే సోషల్ డిస్టెన్స్.

 

అతి తక్కువ భూభాగంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం కావడంతో… కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఏత్తివేస్తే ఈ వైరస్ ఎంత దారుణంగా సోకుతుందో అని తెగ భయపడిపోతున్నారట. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశం కావటంతో కరోనా వైరస్ కట్టడి విషయంలో సమాజంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి కేంద్రం భయపడి పోతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

 

మరోపక్క లాక్ డౌన్ ఇంకా కొనసాగిస్తే ఇళ్లల్లోనే ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చి నిరుద్యోగం సమస్య ఎదురైతే... సమాజంలో ఎలాంటి పరిస్థితులు కొత్తగా ఉత్పన్నమవుతాయి అన్న దాని విషయంలో ఇండియా పాలకులు తెగ బెదిరి పోతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతానికి వేసవి కాలం పైగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటంతో వైరస్ ఎక్కువ బలపడలేకపోతుంది, కాగా రాబోయే వర్షాకాలంలో లాక్ డౌన్ ఏత్తివేస్తే పరిస్థితి ఏమవుతుందో అని భారత దేశ పాలకులు తెగ బెదిరి పోతున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: