కరోనా వైరస్ తీవ్రత దేశంలో రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ మత ప్రార్థనలలో పాల్గొన్న వారికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో దేశంలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటిలో విదేశాల నుండి దేశం లో అడుగు పెట్టిన వారి ద్వారా ఇతరులకు సోకిన వైరస్ అతి తక్కువ కేసులు ఆ సమయం లో నమోదు అయ్యాయి. అయితే ఢిల్లీ కేంద్రంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎప్పుడు బయట పడటం జరిగాయో అప్పుడు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

 

ప్రస్తుతం దేశంలో ఊహించని విధంగా ప్రతి రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటువంటి టైములో కే‌సి‌ఆర్ సడలింపు రిస్క్ తీసుకోవడానికి కూడా డేర్ చేయలేదు. దానికి కారణం చూస్తే ప్రస్తుతం కరోనా వైరస్ స్టేటస్ రెండో దశ నుంచి మూడో దశకి..మధ్య తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఉండటంతో అందుకే కే‌సి‌ఆర్ సడలింపు రిస్క్ తీస్కోలేదు అని తెలంగాణలో వార్తలు వినపడుతున్నాయి.

 

ఈ దశకు చేరుకుంటే ఎవరి ద్వారా సోకిందో అంతుచిక్కకుండా చాలామందికి సోకడం వంటి విషయాలు తెలుసుకోవడం కష్టం అయిపోతుందని ముందుచూపుతో కే‌సి‌ఆర్ సడలింపు రిస్క్ తీసుకునే అవకాశం లేదని బలంగా వినబడుతోంది. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: