మన నేతల తీరే వేరప్పా.. ఒకరినొకరు తిట్టుకున్నట్టే ఉంటుంది.. కానీ తిట్టుకోరు! కొట్టుకున్నట్టే ఉంటుంది.. కానీ అస్సలు కొట్టుకోరు! తిట్టినా..కొట్టినా నువ్వు నాకు నచ్చినోడివిరో..! అన్నట్టే ఉంటుంది మరి! ఏపీ రాజకీయాల్లో ఇక చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్ బంధం.. అనుబంధాల గురించి తెలియంది కాదు జనానికి! ముందు బాగానే ఉన్నట్టు అనిపించింది. కానీ.. ఎక్కడో ఏదో చిన్నపాటి తేడా వచ్చి కొంచెం కారంగా.. కొంచెం దూరంగా ఉన్నారంతే! ఇక 2019 ఎన్నికల్లో బాబుగారికి బొమ్మకనబడింది.. పవనాలుకు ఖాళీ బొచ్చమిగిలింది..! ఇప్పుడు ఇద్దరూ ఉనికిపాట్లు.. కునుకుపాట్లు పడుతున్నారు..! బాబుగారికి మరో అవకాశం లేదుకనక ఏదోఒక విమర్శ ప్రభుత్వంపై చేస్తూ రోజులు వెల్లదీస్తున్నారు.. కానీ.. పవన్‌కు మాత్రం ఓ లెక్కుంది.. జనసేనను కమలంగూటిలో భద్రంగా దాచిపెట్టి తెరపై ఇరగదీసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఇదే గూటికి చేరేందుకు బాబుగారు కూనా తనదైన మహా విన్యాసాలు మొదలుపెట్టినట్లు టాక్.
ఇక తాజాగా.. బాబుగారి జన్మదినం సందర్భంగా.. అనూహ్య విన్యాసమొకటి బయటకొచ్చింది. పుట్టిన రోజు సందర్భంగా బాబు.. పవన్ ముచ్చట్లు విని సోషల్ మీడియాలో చప్పట్లు బాగా మోగుతున్నాయి. ఎవరిస్థాయిలో వారు రెచ్చిపోతున్నారు. అమ్మబాబోయ్..! పనవ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం బాబుగారికి అమితానందాన్ని ఇచ్చాయట..! అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొన్నటికి మొన్న లాక్డౌన్ అమలుపై మోడీని పొగడ్తలతో ముంచెత్తిన బాబు.. ఇప్పుడు పవన్ చెప్పిన శుభాకాంక్షలు అమితానందాన్ని ఇవ్వడం వెనుక ఎక్కడో ఏదో మతలబు ఉన్నట్టే అనిపిస్తుంది. ముందుముందు ఇద్దరి బంధం మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టే ఉంది..! ఒక్కసారి వారి ట్వీట్లు చూద్దాం..* గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు.మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను* అని పవన్ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా.. * పవన్ కళ్యాణ్ గారు... జనసేన అధినేతగా సర్వజన శ్రేయస్సునూ నిండు హృదయంతో కోరుకునే మీ శుభాకాంక్షలు నాకు అమితానందాన్నిచ్చాయి* అని బాబుగారు స్పందించారు. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.
ధన్యవాదాలు @PawanKalyan గారు. జనసేన అధినేతగా సర్వజన శ్రేయస్సునూ నిండు హృదయంతో కోరుకునే మీ శుభాకాంక్షలు నాకు అమితానందాన్నిచ్చాయి https://t.co/bjnOTn44N3
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) April 20, 2020