ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి. చాప కింద నీరులా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంతో ఏపీ అధికార పార్టీ లో కూడా ఆందోళన తగ్గటం లేదు. వైరస్ వచ్చిన స్టార్టింగ్ లో వైయస్ జగన్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎక్కడికక్కడ కట్టడి చేయగలిగారు. కానీ ఢిల్లీ మత ప్రధాన కేంద్రంగా బయటపడిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏపీలో ఒక్కసారిగా పెరగటానికి కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 

దీంతో అసలు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి అన్నదానిపై మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన వైఎస్ జగన్ ఆ సమయంలో కరోనా వైరస్ పరీక్షలు చేసే రాపిడ్ టెస్ట్ కిట్లు సౌత్ కొరియా నుండి కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. తాజాగా ఆ కిట్లు కూడా రాష్ట్రంలో కి వచ్చాయి. దీంతో రాబోయే కొన్ని రోజులలో ఏపీలో భారీగా కరోనా వైరస్ పరీక్షలు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ద్వారా చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వల్ల రోజుకి పదివేల మందికి టెస్టులు చేసే అవకాశం ఉంది.

 

దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని.. కానీ ఇదంతా మంచిదే అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు బయటకు వస్తాయి.. దీంతో వెంటనే వాటిని తగ్గించుకునే దిశగా అడుగులు వేయడమే జగన్ ప్లాన్ అని వైసీపీ పార్టీలో టాక్. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: