వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసిన అవినీతి ని.. కమిషన్ల కాంట్రాక్ట్ పనులను రద్దు చేసే వాటిపై దృష్టి పెట్టిన విషయం అందరికి తెలిసిందే. దీంతో చంద్రబాబు హయాంలో విద్యుత్ విషయంలో అధిక ధరకు సౌర విద్యుత్ కొనుగోలు, పవన విద్యుత్తు కొనుగోలులో ఫిక్స్ చేసిన ధరల వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఖజానా చాలావరకు గల్లంతయింది.  విద్యుత్ కొనుగోలు పిపిఏలు  విషయంలో జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మొత్తం సమీక్షించి రేట్లు తగ్గించడానికి జగన్ బాగా కృషి చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. దీంతో ప్లాంట్లు కి జగన్ ప్రభుత్వం డబ్బు ఆపేయటం జరిగింది. ఈ దెబ్బతో ప్లాంట్లు హైకోర్టు ను ఆశ్రయించాయి.

 

ఇదే టైంలో కేంద్రానికి ప్లాంట్లు లేఖలు కూడా రాశారు. కేంద్రం వెంటనే జగన్ కి సీరియస్ గా నీ వల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ రావడం లేదని చెప్పిన జగన్ వినలేదు. దీంతో విషయం పెద్దది కావడంతో పిపిఏలు విషయంలో మోడీకి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా పెద్ద పని పెట్టినట్లు అయ్యింది. 2003వ చట్టాన్ని సవరించి సరికొత్త చట్టాన్ని తీసుకురావటానికి కేంద్రం రెడీ అయింది. ఈ చట్టం వస్తే ప్రతి రాష్ట్రం పిపిఏల విషయంలో కేంద్రం విధించే విధి విధానాలు అనుసరించాల్సి ఉంటుంది.

 

 ఇది జగన్ సర్కార్ కి పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం ఉందని ప్రస్తుతం వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా పవన మరియు సౌర విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఒప్పందాల్లో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాల్సిందే. ఒకవేళ అలా కొనకపోతే 50 పైసలు చొప్పున కరెంటు కంపెనీలు జరిమానా విధించడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలే నష్టపోతాయి. మొత్తం మీద జగన్ మొండివైఖరి తనకే కీడు  తీసుకువస్తున్నట్లు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: