ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ కిట్లని ఎక్కవ ధరకు కొనుగోలు చేసి, అందులో కమిషన్ నొక్కేసారని అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు వైసీపీ ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ సమాధానమే ఇచ్చింది. తాము కొనుగోలు చేసిన రేటుకు కాకుండా వేరే రాష్ట్రానికి తక్కువ ధరకు కిట్లు ఇస్తే, తాము కూడా అదే ధర ఇస్తామని షరతు పెట్టామని, ఇప్పుడు అలాగే పేమెంట్ చేస్తామని చెప్పింది.

 

అయితే ర్యాపిడ్ కిట్లు రగడ బీజేపీ-విజయసాయిల మధ్య  మాటల యుద్ధానికి దారితీసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో జగన్ ప్రభుత్వం కమిషన్ కొట్టేసిందని ఆరోపించగా, కన్నా...చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ విజయసాయి కామెంట్ చేశారు. 

 

ఇక దీనికి బీజేపీ నేతలు వరుసగా విజయసాయిపై మండిపడుతున్నారు. మొదట కన్నా స్ట్రాంగ్ గానే విజయసాయిపై విమర్శలు చేయగా, ఆయనకు తోడుగా బీజేపీ నేతలు విజయసాయి బ్రోకర్, జైలు పక్షి అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉంటూ చంద్రబాబుతో మంచి అనుబంధం ఉండి, 2019 ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరీ, సీఎం రమేష్ లు సడన్ గా పొలిటికల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు.

 

బీజేపీలోకి వెళ్లినా, బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్న ఈ ఇద్దరు నేతలు గత కొన్ని రోజులుగా సైలెంట్ గానే ఉన్నారు. కానీ కన్నా...  సుజనా,చంద్రబాబుకు అమ్ముడుపోయారనే అనేసరికి, సుజనా చౌదరీ రంగంలోకి దిగేసి, నేలబారు జీవులు మొరుగుడు తాను పట్టించుకోనని అన్నారు. ఇదే సమయంలో సీఎం రమేష్ కూడా లైన్ లోకి వచ్చి, బాధ్యత గల నేతగా కన్నా  ప్రశ్నిస్తే, అర్థంపర్ధం లేని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు.  మొత్తానికైతే ఈ ఇద్దరు నేతలు కన్నాని విమర్శించడం కంటే, బాబు పేరు మధ్యలో తీసుకొచ్చారని చెప్పి, సడన్ గా వచ్చి విజయసాయి మీద విమర్శలు చేసినట్లు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: