ఏపీ సర్కారు కరోనా కట్టడి కోసం దక్షిణ కొరియా నుంచి ర్యాపిట్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది. ఈ పరీక్ష కిట్లను ఒక్కొక్కటి 735 రూపాయలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే ఆర్డర్ పెట్టిన ఐసీఎంఆర్‌ 795 రూపాయలకు అప్పటికే ఆర్డర్ పెట్టేసింది. దీంతో కాస్త తక్కువకే జగన్ సర్కారు ఆర్డర్ పెట్టింది. అయితే పొరుగున ఉన్న చత్తీస్ గడ్ 350 రూపాయలకే ఈ కిట్ కొనుక్కుంటోంది.. అంటే మిగిలిన సొమ్ము కమీషన్ల ద్వారా నొక్కేశారా.. అంటూ బీజేపీ, టీడీపీ ఆరోపణలు ప్రారంభించాయి.

 

 

అసలే రాష్ట్రం కరోనా ఊబిలో చిక్కుకుపోతోంది. వేలు, లక్షల్లో పరీక్షలు నిర్వహించాలని చంద్రబాబే ప్రెస్ మీట్లు పెట్టి మరీ సలహా ఇస్తాడు. ఇప్పుడు అదే పని చేయబోతే.. అబ్బే నువ్వు ఎక్కువ రేటు పెట్టి కొన్నావ్ అంటూ రాజకీయం మొదలెడతారు. ఇక్కడో ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. ఏపీ సర్కారు ఈ కిట్లు కొనుగోలు సమయంలోనే దక్షిణ కొరియాకు ఓ మెలిక పెట్టింది. ఇండియాలో వేరే ఎవరికైనా మా కంటే తక్కువ ధరకు ఇస్తే.. మేం కూడా అదే ధర చెల్లిస్తామని కండీషన్ పెట్టింది.

 

 

ఈ కండీషన్ సంగతి తెలియని బీజేపీ, టీడీపీ దొరికిందే సందని రెచ్చిపోయాయి. కనీసం పర్చేజ్ ఆర్డర్ లో ఏముందో కూడా చూసుకోకుండానే విమర్శలతో రెచ్చిపోయాయి. అయితే అసలు విషయం జగన్ సర్కారు బయటపెట్టడంతో ఈ రెండు పార్టీల నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతు వల్ల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధర తగ్గించేందుకు తయారీ సంస్థ అంగీకరించింది.

 

 

 

చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆర్డర్ చేశామని, ప్రజాధనాన్ని కాపాడే ఆలోచన చేసిన వైద్యఆరోగ్యశాఖ అధికారులను అభినందిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇదంతా చూసిన జనం థూ.. మీ బతుకులు చెడ.. ప్రజల ప్రాణాలు కాపాడే కిట్ల విషయంలో కూడా రాజకీయం వదలరా అంటూ జనం విసుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: