కరోనా వైరస్ అనేది 26 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ఉష్ణ ప్రాంతాల్లో బతకదు.. ఇది కరోనా గురించి మొదట్లో అందరూ ఇచ్చిన సమాచారం.. ఈ సమాచారం సోషల్ మీడియాలో కూడా బాగా చక్కర్లు కొట్టింది. ఒక విధంగా ఈ సమాచారం ఆధారంగానే ఆ కరోనా మన దాకా రాదు.. వచ్చిన మన ఎండలకు ఎప్పుడో పారిపోతుంది అని అంతా అనుకున్నారు.

 

 

కానీ అక్కడే అంతా పప్పులో కాలేశారు. వాస్తవం ఏంటంటే.. ఈ కొత్త కరోనా వైరస్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతికేస్తుంది. వేడి పరిస్థితుల్లో అది చనిపోతుందనేది వాస్తవం కాదు. ఒకవేళ అదే వాస్తవం అయితే.. ఇండియా కంటే ఉష్ణ ప్రాంతాలైన ఎన్నో దేశాలు ఇప్పుడు కరోనా బారిన పడి మరణాలు నమోదు చేసుకుంటున్నాయి. కాబట్టి ఉష్ణ ప్రాంతాల్లోనో.. శీతల ప్రాంతాల్లోనో కరోనా బతకదు అనే మాటలు అస్సలు నమ్మొద్దు.

 

 

ఇండియాలో ఇప్పుడు వేసవి కాలం నడుస్తోంది. ఈ వేసవిలో కరోనా బతికే అవకాశం లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా ఏమాత్రం వాస్తవం కాదు. ఎంతటి వేడిమిలోనైనా కరోనా వైరస్ బతికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేడిమిలో ఇది ఉపరితలాలపై బతకలేకపోయినా.. ఒకసారి రోగి శరీరాన్ని ఆక్రమించాక దాన్ని ఏ వేడీ కూడా ఏమీ చేయలేదు.

 

 

అందుకే ఇలాంటి భ్రమల్లో మీరు అస్సలు ఉండొద్దు. మీ తోటి వారిలో ఇలాంటి భ్రమలు ఉంటే మీరు తొలగించే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా వచ్చేశాక ఇప్పుడు ఏ వార్త అయినా సరే క్షణాల మీద ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్.. ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అనేక వేదికలపై సమాచారం రాకెట్ వేగంతో స్ప్రెడ్ అవుతోంది. అయితే మొదట వచ్చిన సమాచారం తప్పయినా సరే.. ఆ విషయం గమనించేలోగానే అది కోట్ల మందికి చేరిపోతోంది. అందుకే మీకు తెలిసిన సరైన సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: