ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ మహారాష్ట్ర రాష్ట్రం టాప్ పొజిషన్ లో ఉంది. అయితే పరిస్థితి ఎలా ఉన్నా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే ఒక సంచలన ప్రకటన చేసి అందరినీ షాక్కు గురి చేశాడు. అయితే మందుబాబులకు మాత్రం ఫుల్ ఖుషి చేశారాయన. ఇక అసలు విషయానికొస్తే... సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటిస్తానంటే వైన్ షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మాట వినగానే మందుబాబులు ఫుల్ ఖుషీ అయిపోయారు. 


మీరు నిజంగా సూపర్ సార్, మీరు తోపు సార్ అంటూ ఆయన తెగ పొగిడేస్తున్నారు. అయితే ఇదంతా బాగా ఉన్న మంత్రి చెప్పారు కానీ ప్రభుత్వం నుంచి మద్యం షాపులు తెరిచేందుకు ఎలాంటి నోటిఫికేషన్ గానీ, జీవో కానీ జారీ చేయలేదు. అయితే ఈ విషయంపై మంత్రిని ప్రశ్నిస్తే... ఆయన ఇదిగో వస్తుంది త్వరలోనే ప్రభుత్వ ప్రకటన వస్తుంది అని చెబుతున్నారు. అయితే ఇది వరకే దేశంలోని మేఘాలయ, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలను అనుమతించి కొనసాగిస్తున్నారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ రోజు, రేపు అన్నట్టుగా ఈ దిశగా నిర్ణయం తీసుకోపోతుంది.


నిజానికి మహారాష్ట్రలో మద్యం షాపులు మూతపడడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది. దీనితో కరోనా వైరస్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా మందుబాబులు వారి బాధను వెళ్లగక్కుతున్నారు. అయితే కొంత సమాచారం వరకు తెలిసింది ఏమిటంటే హాట్ స్పాట్ కానీ ప్రదేశాల్లో దశలవారీగా మద్యం షాపులకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. అంటే దీని ప్రకారం మే 15 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు, అలాగే మే 15 నుంచి జూన్ 15 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు, జూన్ 15 తర్వాత మామూలు పరిస్థితులు నెలకొంటాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: