కరోనా వైరస్ ఉగ్ర రూపంలో ప్రపంచం మొత్తం కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ దేశాలను కబళిస్తూ ఎంతో మందిని బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలందరినీ ప్రాణభయంతో బతికేలా చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఎలా ఉన్నప్పటికీ అగ్రరాజ్యాల లో  మాత్రం కరోనా  విపత్తు మరింత దారుణంగా ఉంది అని చెప్పాలి . ముఖ్యంగా అమెరికా ఫ్రాన్స్ ఇటలీ లలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. కరోనా  వైరస్ను ఎదిరించడానికి సహాయం కావాలి అంటూ అగ్రరాజ్యాల అధ్యక్షులు సైతం వేడుకుని వరకు వచ్చింది పరిస్థితి. ఇక కరోనా  వైరస్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరువఅవుతుంది. 

 

 తాజాగా ఫ్రాన్స్ లో నమోదైన గణాంకాలు చూస్తుంటే ప్రపంచ దేశాల ప్రజల్లో వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇప్పటివరకు ఫ్రాన్స్ లో కరోనా  వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 20,000 దాటిపోయింది. అయితే ఈ వైరస్ బారినపడి విలవిల లాడుతున్న తొలి ఐదు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ దేశంలో ఇప్పటివరకు ఏకంగా 1.55 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక రోజురోజుకు ఇక్కడ మరణాల రేటు కూడా భారీగా పెరిగి పోతుంది. ఈ నేపథ్యంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా కరోనా వైరస్ పై పోరాడలేక  చేతులెత్తేసాయి . అయితే నిన్న ఒక్కరోజే  547 మంది ఈ మహమ్మారి వైరస్ తో పోరాడలేక మృత్యువు ఒడిలోకి చేరారు. 

 

 

 దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇప్పటివరకు కరోనా  వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 20265 కు చేరింది. దీన్ని అధికారికంగా అక్కడి అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా 37,495 మందికి ఈ వైరస్ బారినపడి కోలుకొని డిశ్చార్జ్ కాగా .. ప్రస్తుతం 97, 709 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి అంటూ తెలిపారు అక్కడి వైద్యాధికారులు. అయితే రోజురోజుకు మరణాల రేటు పెరిగిపోతున్న తరుణంలో అక్కడి ప్రజలందరూ భయం గుప్పిట్లో ని బతుకుతున్నారు. ఎక్కడ తమ ప్రాణాలు పోతాయో అనే భయంతో ప్రతి  క్షణం ఒక యుగం ల బతికేస్తున్నారు. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసుల దృశ్య ఫ్రాన్స్ ప్రభుత్వం ఎన్నో కఠిన నిబంధనలు కూడా తెర మీదికి తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: