క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌..వ్యాధి సోకిన వారిని త్వ‌రిత‌గ‌తిన గుర్తించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఓ కొత్త ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్ట‌బోతోంది. ఇప్ప‌టికే అధికారుల‌తో ముఖ్య‌మంత్రి చ‌ర్చ‌లు కూడా పూర్తి చేశారు. కావాల్సిన ఏర్పాట్ల‌ను..సామ‌గ్రిని వైద్య‌సిబ్బందికి చేరేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అస‌లు విష‌య‌మేమంటే మొబైల్ ప‌రీక్షాకేంద్రాల‌ను అమ‌ల్లోకి తీసుకు రావ‌డా నికి ప్ర‌భుత్వం వేగంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ ప‌ద్ధ‌తిలో వైద్య సిబ్బంది నేరుగా క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న వారి ఇంటికి వెళ్లి ప‌రీక్ష‌లు చేస్తారు.  తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న కొత్త‌విధానంలో ప‌రీక్ష‌ల వ‌ల‌న ప్ర‌భుత్వానికి ఆర్థిక భారం త‌గ్గ‌డంతో పాటు వైద్య‌సిబ్బంది త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ఆస్కారం ఉంటుంది.

 

 అంతేగాక అవ‌స‌రం లేకున్నా..క్వారంటైన్‌కు త‌ర‌లించే బాధ త‌ప్పుతుంది. పైగా క్వారంటైన్‌కు త‌ర‌లించ‌డం వ‌ల‌న కొంత‌మందికి పాజిటివ్‌గా సైలెంట్ మోడ్‌లో ఉంటున్న వ్యాధి ఆస్ప‌త్రిలోనే ఆరోగ్య‌వంతుల‌కు సోకే ప్ర‌మాదాల‌ను వైద్యులు గుర్తించార‌ట‌. ఇక ఇంటి వ‌ద్ద‌నే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌ల‌న వారి ఆరోగ్య స్థితిగ‌తుల‌ను వైద్య సిబ్బంది ఓ మారు ప‌రిశీలించ‌డంతో పాటు హోం క్వారంటైన్‌లోన కంటిన్యూ అయ్యేలా చూడ‌వ‌చ్చ‌న్న‌ది తెలంగాణ వై‌య‌ద్య‌శాఖ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. పైగా చాలామంది ఆస్ప‌త్రికి వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి సంకోచిస్తున్న‌ట్లుగా నిఘా వ‌ర్గాల ద్వారా ప్ర‌భుత్వానికి నివేదిక చేరింద‌ట‌.

 

ప్ర‌జ‌ల‌ను బ‌ల‌వంతంగా ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి ప‌రీక్ష‌లు చేయించ‌డం అనేది సాధ్యం కాని ప‌ని అని ప్ర‌భుత్వం గుర్తించింది. అయితే ఇంటి వ‌ద్ద‌నే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం విధానం అమ‌లు చేయ‌డం ద్వారా క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న వారంద‌రూ స్వ‌చ్ఛ‌దంగా ముందుకు వ‌చ్చేందుకు ఆస్కారం ఉంటుంద‌ని భావిస్తోంది. ఇక ఇప్ప‌టికే కంటోన్మెంట్ల‌లో డోర్ టు డోర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక మొబైల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం తీసుకునేందుకు ప్ర‌భుత్వం  టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన వెంట‌నే వైద్య సిబ్బంది వారి ఇళ్ల‌కు చేరుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తార‌ని వైద్యాధికారులు చెబుతున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: