ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ టౌన్ కొనసాగుతోంది. మొన్నటికి మొన్న ఏప్రిల్ 14 తోనే ముగిసినప్పటికీ కరోనా  ఎఫెక్ట్ మరింతగా పెరిగి పోవడంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే  3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే మే మూడు కంటే ఎక్కువగానే లాక్ డౌన్  కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో  ఉద్యోగులు ఎవరు ఆఫీస్కి వెళ్లడం లేదు అన్న విషయం తెలిసిందే. అందరూ వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఇంటినుండే ఆఫీస్ పని చేస్తున్నారు . అయితే రోజూ ఆఫీసుకు వెళ్లి పని  చేయాలా ఇంటినుంచే వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది అనే ఉద్యోగుల కోరిక కరోనా వైరస్ కారణంగా నెరవేరింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే లాక్ డౌన్  ఎత్తివేసిన తర్వాత ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ కి వెళ్లి ఉద్యోగం చేయాలా లేదా వర్క్ ఫ్రం హోం అనేది కొనసాగుతుందా అన్నది ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతోంది. మామూలుగా అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పూర్తయిన తర్వాత... కరొనా  వైరస్ విపత్తు తొలగిపోయిన తరువాత ప్రపంచంలోని ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 

 

 

 ముఖ్యంగా ఉద్యోగులు పనిచేసే శైలిలో ఎన్నో మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఉద్యోగులందరికీ లాక్ డౌన్ ఎఫెక్ట్  ద్వారా వర్క్ ఫ్రొం హోమ్ అనేది శాశ్వతం గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు. అయితే దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో లాక్ డౌన్  పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయాలా లేదా ఆఫీసుకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలి అనే దానిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల తో పాటు ప్రభుత్వేతర సంస్థలో పని చేసే ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి... పని గంటలు, వేతనం తదితర విషయాలకు సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది . ఒకవేళ ఇంటి నుండి పని చేసే విధానం మరి ఇన్ని రోజులు విస్తృతంగా కొనసాగితే ప్రత్యేక మార్గదర్శకాలు  తీసుకు రావడం అనివార్యం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టం లో దీనికి నిర్దిష్ట మార్గదర్శకాలు ఏవీ లేవని...కానీ లాక్ డౌన్  పూర్తయ్యేంత వరకు ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: