మ‌ర్క‌జ్ స‌మావేశం కార‌ణంగానే క‌రోనా వైర‌స్ దేశ వ్యాప్తంగా విస్త‌రించింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో త‌బ్లీగ్ జ‌మాత్ చీఫ్ మౌలానా సాద్ కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేశారు.  తబ్లీగ్ జమాత్‌కు చెందిన కొంతమంది సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ రావడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్న ఆయ‌న, అయితే  దేశంలో కరోనా ప్రబలేందుకు మర్కజ్ కారణమంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించారు. జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఓ మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్క‌డికి పారిపోలేద‌ని స్ప‌ష్టం చేశారు. కొంత‌మంది త‌న‌పై లేనిపోని అభియోగాలు మోపుతున్నార‌ని అన్నారు. 

 

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లోని బంగ్లా వాలీ మసీదులో మత ప్రసంగాలు ఏడాది పొడవునా సాగుతుంటాయని గుర్తు చేశారు.  మసీదులో మత ప్రసంగాలు చేయడానికి ప్రత్యేకంగా అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  గతంలో కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి ప్ర‌శ్న‌లు భార‌త ప్ర‌భుత్వం నుంచి ఎదురుకాలేద‌ని అన్నారు. అయితే క‌రోనా వైర‌స్ త‌బ్లీగి ప్ర‌తినిధుల‌కు పాజిటివ్‌గా వ‌చ్చిన నేప‌థ్యంలోనే కొంత‌మంది క‌క్ష‌పూరితంగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. ఇక‌
ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుకు తాను త్వ‌ర‌లోనే తగిన సమాధానం ఇస్తామని  వెల్ల‌డించారు. 


 జమాత్ సమావేశానికి వచ్చిన విదేశీయులు వీసా నిబంధనలు పాటించ‌డం లేద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లతో జ‌మాత్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు మాత్ర‌మే త‌మ పాత్ర ఉంటుంద‌ని, మిగ‌తా విష‌యాల‌తో సంస్థకు గాని, ప్ర‌తినిధుల‌కు గాని ఎలాంటి సంబంధం లేద‌ని తెలిపారు.మార్చి నెల జమాత్ సమావేశం ముందస్తుగా నిర్ణయించామని, కాని సమావేశం తర్వాత జనతా కర్ఫ్యూ విధించడంతో తాము కార్యక్రమాన్ని నిలిపివేసి మర్కజ్ ను ఖాళీ చేయించామ‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు.  ఇక తాను వైద్యుల సలహా మేర‌కు స్వీయ నిర్బంధంలో ఉన్నాన‌ని , పరారీలో ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: