చంద్రబాబు రాజకీయ గండర గండడు. కింద పడ్డా మీదనే చేయి అనగలడు. అన్నింటి కంటే ముఖ్య విషయం ఓటమిమి అసలు ఒప్పుకోలేని తత్వం. పైగా అవిశ్రాంతంగా పోరాడడం. సవాళ్ళను, సమస్యలను సైతం విజయసోపానాలుగా మార్చుకోవడం.

 

ఇపుడు చంద్రబాబు డెబ్బయ్యేళ్ల వారు.  ఆయనకు వయసు ఒక  సాంకేతికమే. మనసు మాత్రం ఎపుడూ  పాతికేళ్లే. లేకపోతే గత అర్ధ శతాబ్దంగా రాజకీయం చేస్తున్నా ఎక్కడా అలుపూ సొలుపూ లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో  ఇక 23 సీట్లో దారుణంగా ఓడిన తరువాత నిజంగా ఎంత వారి గుండె అయినా జారిపోతుంది.

 

బాబు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. రోజురోజుకూ జగన్ కంటే యువకుడిగా మారి పోరాడుతున్నారు. విముఖంగా ఉన్న మోడీ నుంచి ఫోన్ రప్పించుకున్న చంద్రబాబు అదే ధైర్యంతో భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మళ్లీ బీజేపీ ఆశీస్సులు ఉంటే చాలు తాను అందలం ఎక్కడం ఖాయమనుకుంటున్నారు.

 

చంద్రబాబుకు ఈసారి పుట్టిన రోజు చాలా ఆనందంగా గడిచింది. ఆయనకు జగన్ ఫోన్ చేయడం ఒక విశేషం అయితే మరో వైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అభినందించడం. ఇక పవన్ కి బాబు రిప్లై కూడా ఇచ్చి ప్రజల కోసం జనసేన తరఫున పోరాడుతున్న ప్రజా నేత‌గా అభివర్ణించారు.

 

అంటే పవన్ కి మళ్ళీ గాలం వేస్తున్నారనుకోవాలి. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా బాబుకు ట్యూన్ అవుతున్నారు ఈ మొత్తం పరిణామాలను చూసుకుంటే 2014లో జరిగిన పరిణామాలు 2024లో జరుగుతాయని అంటున్నారు. చంద్రబాబు జగన్ని గద్దె దించడానికి సరికొత్త కాంబోని సిధ్ధం చేస్తున్నారని చెబుతున్నారు. మరి అదే కనుక జరిగితే జగన్ కి ముప్పు పొంచి ఉన్నట్లే, జగన్ కూడా రాజకీయంగా వ్యూహాలు మార్చాలేమో.  లేకపోతే బాబు రాజకీయ వ్యూహలు బాగా పదునెక్కి బాణాలు వేస్తయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: