క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను చైనా వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన చైనా వైద్య ప‌రిశోధ‌న సంస్థ వేర్వేరు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై  ప్రయోగాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) చెబుతు న్న వివ‌రాల ప్ర‌కారం.. చైనాలో మూడు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేస్తున్నారు. ఆ దేశ సైన్యంపై ప్ర‌యోగించేందుకు వైద్య విభాగం ఎడినోవైరస్‌ వెక్టార్‌ వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే సిద్ధం చేసింది. మ‌లి విడ‌త‌లో కొంత‌మంది ప్ర‌జానీకంపై  దాదాపు 500మందికి  క్లినికల్‌ ట్రయల్స్ నిర్వ‌హించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. 

 

సాధారణ ప్రక్రియలో అయితే వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదటి వరకు రాదని చైనా వ్యాధి నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ప్రయోగాలు చేపడుతున్నామని  సంస్థ అధికారులు పేర్కొన్నారు.ఇదిలా ఉండ‌గా  చైనాలోమరోసారి వైరస్‌ విజృంభిస్తుందని అక్కడి వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. సోమ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 11కేసులు న‌మోదుకావ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది.  విదేశాల నుంచి వస్తున్న వారిలో పాజిటివ్‌ వస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇందులో నలుగురు విదేశాల నుంచి రాగా మిగతా ఏడుగురికి దేశంలోనే వైరస్‌ సోకింది. 

 

రష్యా సరిహద్దుల్లోని హేలియాంగ్‌జియాంగ్‌లో కేసులు పెరగడం డ్రాగన్‌ను కలవరపెడుతోంది. వీటితో పాటు 37 లక్షణాలు కనిపించని కేసులు నమోదయ్యాయని కమిషన్‌ వెల్లడించింది. న‌వంబ‌ర్ మాసంలో వైర‌స్ ఉధృతి ఎక్కువ‌గా ఉంటుంద‌ని మొద‌టి నుంచి చైనా ప్ర‌భుత్వం నుంచి వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి. చ‌లిప్రాంతాల్లో ఎక్కువ స‌మ‌యం వైర‌స్ మ‌న‌గ‌లిగి ఉండ‌ట‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వైద్య నిపుణులు కూడా చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇక అమెరికా కూడా క‌రోనాకు వ్యాక్సిన్‌ను క‌నుగోనేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే కొలిక్కి వ‌చ్చిన కొన్ని ప్ర‌యోగాలతో వ్యాక్సిన్‌ను త‌యారు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు స‌మాచారం.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: