చైనా మ‌రో త‌ప్పుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌ను ప్ర‌పంచంపైకి వ‌దిలిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఈ దేశం మ‌న దేశంతో సరిహద్దును పంచుకునే అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు ప్రభుత్వ ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంపై చేత‌కాని విమ‌ర్శ‌లు చేస్తోంది. కరోనా సంక్షోభం సమయంలో ఇదే అదునుగా చైనా కంపెనీలు మన సంస్థలను బలవంతంగా టేకోవర్‌ చేయకుండా రక్షణాత్మక చర్యలు భారత్‌ ప్రభుత్వం చేపట్టింది. చైనాతో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, భూటాన్‌, నేపాల్‌, మయన్మార్‌, ఆఫ్గనిస్తాన్‌ దేశాలు భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇది వరకు పాకిస్తాన్‌ ఎఫ్‌డీఐలకు మాత్రమే ఈ ఆంక్షలు ఉండేవి. పాక్‌కు చెందిన వ్యక్తి లేదా కంపెనీ భారత్‌లో కొన్ని రంగాల్లో మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా కేంద్రం అనుమతి తప్పనిసరి.

 


అయితే, దీనిపై చైనా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది.  భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జి రాంగ్  ఈ మేర‌కు చైనా వాద‌న వినిపించారు. ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ తీసుకొచ్చిన నిబంధనలు సరికాద‌ని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు విరుద్ధమని, వాటిని భారత్‌ ఉల్లంఘించిందని చైనా ప్ర‌తినిధి ఆరోపించారు. భారత్‌ అన్ని విదేశాల పెట్టుబడులను సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. చైనాపై వివక్షతోనే భారత్‌ ఎఫ్‌డీఐ కొత్త నిబంధ నలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా విమర్శించారు. భారత్‌ బహిరంగ సరసమైన, సమానమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించుకోవాలని చైఆ సూచించింది. ఇటీవలి కొత్త ఎఫ్‌డీఐ నిబంధనలను ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని చైనా పేర్కొంది. డబ్ల్యూటీఓ మార్గదర్శకాలనే ధిక్కరించే విధంగా భారత్‌ ప్రవర్తించడం సరికాదని, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చైనా చెప్పుకొచ్చింది. భారత్‌ను ఎప్పుడూ తాము మిత్ర దేశంగానే చూశామని, చైనా పెట్టుబడులు ఎప్పుడు కూడా భారత్‌ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడ్డాయని ఈ సందర్భంగా డ్రాగెన్‌ గుర్తు చేసింది. 

 


కాగా, ఒక దేశ ఆర్థిక, వ్యాపార వాతావరణం అనుగుణంగానే కంపెనీ లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జి రాంగ్‌ పేర్కొన్నా రు. కోవిడ్‌ – 19 కారణంగా కుంగిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి దేశాలు కలిసి మెలిసి పని చేయాలని, పెట్టుబ డులకు అనుకూల వాతావరణం నెలకొల్పి పరిశ్రమలు ఉత్పత్తి, కార్యకలా పాలు ప్రారంభించే విధంగా ఉండాలని అభిప్రాయ పడ్డారు. ఈ కొత్త విధానంలో చైనా గురించి స్పష్టంగా చెప్పకపో యినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం తమ పెట్టుబడిదారు లపై స్పష్టంగా కనిపిస్తోందని చైనా రాయ బార కార్యాలయం అధికార ప్రతినిధి జి రాంగ్‌ తెలిపారు. వివక్షపూరిత నూతన విధానాలను భారత్‌ మారుస్తుం దన్న ఆశా భావాన్ని రాంగ్‌ వ్యక్తం చేశారు. అన్ని దేశాల పెట్టుబడులనుసమానంగా చూడాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: