ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా గురించి కొన్ని విష‌యాలు ఎవ్వ‌రికి ఇప్ప‌ట‌కీ అంతు ప‌ట్ట‌డం లేదు. అస‌లు ఈ మ‌హ‌మ్మారి ఎవ‌రికి ఎందుకు వ‌స్తుంది ? ఎవ‌రిని ఎందుకు చంపేస్తుంది ? అన్న‌ది ఇప్ప‌ట‌కీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ్వరికి తెలియ‌ని సీక్రెట్‌. ఇటీవల మ‌న‌దేశంలో జ‌రిగిన కొన్ని విష‌యాలు చూస్తూ క‌రోనా పేరు చెపితేనే పిచ్చెక్కిపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇటీవ‌ల ముంబై నగరంలోని రాజావాడి ఆస్పత్రికి 25 ఏళ్ల యువకుడు కరోనా వైరస్‌ బాధితుడిగా వచ్చి చేరారు. ఆ యువకుడికి ఊపిరితిత్తుల సమస్యగానీ, తీవ్రమైన కిడ్నీల సమస్యగానీ, మధుమేహంగానీ, ఆఖరికి రక్తపోటుగానీ లేవు. అయినా చ‌నిపోయాడు.

 

ఇక అదే రోజు లోక‌మాన్య తిల‌క్ మెడిక‌ల్ కాలేజ్‌లో 45 ఏళ్ల యువ‌కుడు అనారోగ్యంతో చేరాడు. ఆ యువ‌కుడికి క‌రోనా ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఇత‌ర ప్ర‌మాద‌కర జ‌బ్బులు లేవు. అత‌డు కూడా కోలుకోలేక‌పోయాడు. చైనాతోపాటు పలు దేశాల నుంచి వచ్చిన వార్తల ప్రకారం కరోనా వైరస్‌ పదేళ్లలోపు పిల్లలకు సోకదని, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయ జబ్బులతో బాధ పడుతున్న వారికే ఈ వ్యాధి పెద్ద డేంజ‌ర్ అన్న మాట‌లు ఇప్ప‌టి వ‌ర‌కు విన్నాం.. కానీ ఈ సంఘ‌ట‌న‌ల త‌ర్వాత క‌రోనా ఎవ‌రికి అయినా వ‌స్తుంద‌ని. ఎంత ఆరోగ్యంగా ఉన్న వారిని అయినా చంపేస్తుంద‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మైంది. 

 

ఇక ముంబై డాక్ట‌ర్ల నివేదిక‌ల ప్ర‌కారం కరోనా బాధిత మృతుల్లో 87 శాతం మంది ఇతర రోగాలతో బాధ పడుతున్నవారు ఉండగా, ఏడెనిమిది శాతం మంది వృద్ధాప్యం కారణంగా చనిపోయారు. మిగిలిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారు కూడా చ‌నిపోయారు. దీనిని బ‌ట్టి క‌రోనా విష‌యంలో రోగాలు ఉన్న‌వారితో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అర్థ‌మ‌వుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: