ఇంకొన్ని రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఉపవాసాల కోసం ముస్లిం సోదరులందరూ సంసిద్ధమయ్యారు. ఎంతో నిష్టగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు ముస్లిం సోదరులు. ముస్లిం సోదరులందరికీ అతి పెద్ద పండుగ రంజాన్. అయితే రంజాన్ మాసం వస్తుంది అంటే ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూసేది దేని గురించి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది హలీం. రంజాన్ మాసం లో మాత్రమే దొరికాయి నోరూరించే వంటకం హలీమ్. ముఖ్యంగా నగరంలో ఏ లెవల్లో హలీమ్ కోసం ప్రజలు ఎగబడతారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే తేడా లేకుండా హలీమ్ తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ  ఉంటారు. ఇక హైదరాబాద్ లో  మతాలకు అతీతంగా ఏకమై పోతూ ఉంటారు. 

 

 

 అందుకే రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీం. ఇక ఎక్కడ చూసినా హలీం దుకాణాలే  కనిపిస్తూ ఉంటాయి హలీం  తయారీ కోసం అందరూ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారూ.  ఇలా హలీం తయారీ కోసం ఎన్నో ఏర్పాటు జరుగుతూ ఉంటాయి. మరి రంజాన్ పండగ కి హలీం లేదు అంటే అది అసలు రంజాన్ పండగ లాగానే అనిపించదు. ఎందుకంటే రంజాన్  వస్తుందంటే హిందూ ముస్లిం క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరూ ఎదురు చూసేది  హలీం కోసమే.  రంజాన్ పండుగ ముస్లిముల పండుగ అయినప్పటికీ అందరికీ ఫేవరెట్గా ఉంటుంది. కారణం నోరూరించే హలీం . ఒక్కసారి హలీం అలా నోట్లో పెట్టుకుంటే క్షణాల్లో కరిగి పోవాల్సిందే. అలాంటి హలీం ఈ  రంజాన్ పండగ కి మాత్రం కనిపించకపోవచ్చు అనే అనుమానం వ్యక్తమవుతోంది. 

 

 

 ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ వినిపిస్తున్న నేపథ్యంలో హలీం తయారీ చేస్తారా  లేదా  అనే ప్రశ్న కొంతమందిలో ఉండేది. ఇక తాజాగా హలీమ్ తయారీ దారుల సంఘం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఏడు రంజాన్ పండగ కి హలీం తయారు చేయబోమంటూ  తేల్చేసింది. హలీం తయారీ గాని అమ్మకం  కూడా జరగబోవు అంటూ తీర్మానం చేసింది హలీం తయారీ దారుల సంఘం. దీంతో హలీమ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చాలామందికి నిరాశే ఎదురైంది చెప్పాలి. మొదటిసారి సారి హలీం లేకుండా రంజాన్  జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు.

మరింత సమాచారం తెలుసుకోండి: