పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసేటట్టు కనిపిస్తున్నారు. రాష్ట్రంలోని లాక్‌ డౌన్‌ అమలును పర్యవేక్షించేందుకు కోల్కతాకు వచ్చిన కేంద్ర సహాయ బృందాలను క్షేత్రస్థాయికి పోనివ్వట్లేదని తెలుస్తోంది. భారత్ లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ అమలు సరిగ్గా కావడం లేదని, ఉల్లంఘనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి అందరికి తెలిసిందే.

IHG


అయితే ఆ నగరాల్లో లాక్‌ డౌన్‌ అమలు తీరును పరీక్షించేందుకు అంతర్‌ మంత్రిత్వ బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. దేశంలోని బెంగాల్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు పంపించింది. అయితే తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌ లోనూ కేసులు పెరుగుతుండగా తమ రాష్ట్రంలోకే ఎందుకు పంపారో వివరణ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాను మమత బెనర్జీ డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు వారికి సహకరించబోమని ఆవిడ బెదిరించారు.

 

 

"ఈ రోజు మేము పర్యటించేందుకు సహకరిస్తామని మాటిచ్చారు. అయితే ఈ రోజేమో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారు చెబుతున్నారు. మమ్మల్ని అసలు బయటకు రానివ్వడం లేదు' అని కోల్‌కతా పర్యటన బృందానికి నేతృత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర పేరుకొన్నారు. అయితే కేంద్ర బృందాలు ఇతర రాష్ట్రాలకూ వెళ్లాయి అక్కడ వారికి పూర్తి సహకారం లభించింది. అయితే పశ్చిమ్‌ బెంగాల్‌ కు ఇచ్చినట్టే వారికీ నోటీసులు కూడా ఇచ్చారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేవని ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే ఇది ఇలా ఉండగా పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘిస్తున్నారని నివేదికలు అందాయని ఇది వరకే కేంద్రం ఆ రాష్ట్రానికి రెండు సార్లు లేఖలు రాయడం నిజగంగా శోచనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: