అమెరికాలో కరోనా రక్కసి తన పంజా విరుసుతోంది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరిగిపోవడంతో పాటు బాధితుల సంఖ్య లక్షల్లో నమోదు అవుతోంది. ఒక పక్క ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిపోవడం, మరోపక్క లెక్కకి మించిన కంపెనీలు మూత బడటంతో నిరుద్యోగ సమస్య 2 కోట్లకి పైగానే చేరుకుంది. అయితే ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి అమెరికాకి దాపరించడానికి ప్రధాన కారణం ట్రంప్ అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపధ్యంలో అమెరికాకి చెందిన ప్రఖ్యాత పత్రికలు ట్రంప్ ని ఏకి పారేస్తున్నాయి. అయితే సదరు పత్రికల విమర్శలు ఇక్కడితో ఆగిపోలేదు..

IHG

అమెరికాకి అత్యంత ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ ని టార్గెట్ చేశాయి. ట్రంప్ పుణ్యమా అంటూ వైట్ హౌస్ కూడా పత్రికలకెక్కి పరువు తీసుకుంటోంది. అమెరికన్స్ ఎంతో సెంటిమెంట్ గా భావించే వైట్ హౌస్ పై వాషింగ్టన్ పోస్ట్ లో వైట్ హౌస్ వైఫ్యలం అంటూ సంచలన కధనం రావడంతో ఇప్పుడు అమెరికన్స్ అందరూ ట్రంప్ పై బగ్గుమంటున్నారు..రెండు రోజుల క్రితం న్యూయార్ టైమ్స్  ట్రంప్ బాధ్యతారాహిత్యత వలనే అమెరికాలో మరణాలు పెరిగాయని, అమెరికా ఆర్ధిక పరిస్థితి ఎన్నడూ లేనంతగా దనీయంగా మారిపోవానికి ట్రంప్ నిర్లక్ష్యమే  కారణమని రాసుకొచ్చింది..ఇదిలాఉంటే

IHG

కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో వైట్ హౌస్ ఘోరాతి ఘోరంగా విఫలం అయ్యిందని ప్రచురించింది. నాలుగు ప్రధానమైన విషయాలో వైట్ హౌస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపింది.కరోనాకి అవసరమైన పరీక్షలని నిర్వహించే విషయంలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పై నమ్మకం పెట్టుకుందని ఇది అతిపెద్ద తప్పని తెలిపింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలని ముందుగానే అలెర్ట్ చేయడంలో పూర్తి వైఫల్యం చెందిందని, నిధులు కేటాయించే విషయంలో సైతం అలసత్వాన్ని ప్రదర్శించి రాజకీయ ఉపయోగాలవైపు దృష్టి పెట్టిందని విమర్శించింది.

IHG

కరోనా వైరస్ సమయంలో జరిగిన అంతర్గత పోరులో వైరస్ టాస్క్ ఫోర్స్ విదులకి ఆటంకం కలిగించేలా ప్రవర్తించిందని ఆరోపించింది. తాము ఈ విషయాలపై ఎంతో మంది వైద్యులు, ఇంటిలిజన్స్ అధికారులు, నిపుణులుచే సర్వే నిర్వహించామని అందులో ఇలాంటి ఎన్నో విషయాలు బయటపడ్డాయని తెలిపింది. కరోనా వచ్చిన కాలం మొదలు ఇప్పటి వరకూ వైట్ హౌస్ అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యిందని ప్రకటించింది. అయితే వైట్ హౌస్ పై ఇలాంటి వార్తలు రావడానికి ట్రంప్ చర్యల పుణ్యమేనని ట్రంప్ ముందుగానే అలెర్ట్ అయ్యి ఉంటే శ్వేత సౌధం పై  ఇలాంటి వార్తలు వచ్చేవి కావని  అమెరికన్స్ మండిపడుతున్నారు..ఈ పరిణామాలు భవిష్యత్తులో ట్రంప్ ని ఇరకారంలోకి నెట్టడం ఖాయమనేది విశ్లేషకుల అభిప్రాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: