ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక్కసారిగా గత 24 గంటల్లో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న సైతం ప్రారంభం అయింది. ఇదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఒకింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని డిసైడ్ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ సమీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగానే ఆదేశాలు వెల్ల‌డించారు. 

 

ఏపీలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది.. ఇప్పటి వరకు 92 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. 20 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా నమోదు అయిన త‌రుణంలో క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్షించిన సీఎం జ‌గ‌న్ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కరోనా కేసుల స్థితి, టెస్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై చర్చించారు. ముస్లిం మత పెద్దలు. అందరూ కరోనా నియంత్రణకు సహకరిస్తున్నారని, సీఎం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. ఈ సమయంలో తప్పుడు ప్రచారం, నకిలీ వార్తలు పుట్టించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు ఏపీ సీఎం జగన్‌ను కోరారు. కర్నూలులో కోవిడ్ నివారణ చర్యలు గట్టిగా తీసుకుంటున్నా.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశార. ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారంపై నివేదిక పంపాలని కర్నూలు కలెక్టర్, ఎస్పీకి సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.  రంజాన్ మాసంలో ప్రార్థనల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చ జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ  సీఎంలు ఆళ్లనాని,అంజాద్ భాష  మంత్రి మోపిదేవి, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు హాజరయ్యారు.

 

ఇక, గత 24 గంటల్లో చిత్తూరులో 25 కేసులు నమోదు కగా.. గుంటూరులో 20, కర్నూలులో 16, కృష్ణా జిల్లాలో 5, అనంతపురంలో 4, కడపలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. 174 పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: