ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ప్రభుత్వ ఖజానాకు ఏ విధంగా డబ్బులు చేరుతాయ్యో, పెట్రోలు ఉత్పత్తుల నుండి కూడా అదే స్థాయిలో డబ్బులు ఖజానా కి చేరతాయి. అయితే ప్రస్తుతం వైరస్ ఎఫెక్టుతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా వైరస్ ఎఫెక్టుతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఎక్కడా కూడా రాకపోకల వాహనాలు లేకపోవటంతో ఈ పరిస్థితి దాపురించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా పరిస్థితి ఇలానే ఉందని ఆయిల్ నెగిటివ్ లో అనగా మైనస్ లోకి వెళ్ళిపోయినట్లు ఇటువంటి పరిస్థితి చరిత్రలో మొట్టమొదటిసారి నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.

 

కొన్ని దేశాలలో రాష్ట్రాలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతోన్న గాని ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు మైనస్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో వినపడుతున్న లెక్కలు బట్టి చూస్తే.. డబ్ల్యూటీఐ క్రూడ్ మే ఫ్యూచర్స్ ధర సోమవారం రాత్రి మైనస్ 38 శాతానికి పడిపోయింది. ఇక ఇటీవల జూన్ కాంట్రాక్ట్‌కు సంబంధించి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.73 శాతం పెరుగుదలతో 26.18 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 8.86 శాతం పెరుగుదలతో 22.23 డాలర్లకు పెరిగింది.

 

 

లాక్ డౌన్ కారణంగా రోడ్డెక్కితే వారి సంఖ్య తగ్గిపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు పడిపోయాయి. దాదాపు ప్రపంచ స్థాయిలో ఈ పరిస్థితి ప్రతిచోట ఉన్నట్టు అందరూ చెప్పుకొస్తున్నారు. వైరస్ పరిస్థితి తీవ్రంగా ఉండి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతే మరింత దారుణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మైనస్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: