ఏపీలో కరోనాపై రాజకీయాలు ఓ రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక వీరి రాజకీయాల్లోకి రాజధాని రచ్చ కూడా వచ్చి చేరింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జగన్, మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఇక ఆ రాజధానులపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం కరోనా కేసులని దాస్తోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని విశాఖకు తరలించాలనే ఉద్దేశంతో వైసీపీ, కరోనా ఉన్నవారిని ప్రయివేట్ ఆసుపత్రులకు పంపించి, కరోనా కేసులని తక్కువ చేసి చూపిస్తున్నారని అంటున్నారు.

 

టీడీపీ నేతలు చేసే విమర్శలకు వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు కరోనా దాయడం ఎవరి వల్ల కాదని, టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కరోనా తగ్గాక ఎలాగో రాజధాని మారుతుందని, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ కరోనాని అడ్డం పెట్టుకుని రాజధాని మార్చాల్సిన అవసరం లేదు అంటున్నారు.

 

ఇదే సమయంలో విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, పూర్తి వాస్తవాలని బయటపెట్టారు. టెస్టింగ్ ల్యాబ్‌లు అన్నీ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, ఆ డేటాను నేరుగా ఆన్‌లైన్లోనే అప్‌లోడ్ చేస్తున్నారని, కాబట్టి కరోనా కేసులు దాయడంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. విశాఖలో ఇప్పటి వరకు మొత్తం 21 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో 4గురు ఉన్నారని, 17 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు.

 

ఇంకా విశాఖ జిల్లాకు 18వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని, జిల్లాలో నాలుగో దశ సర్వే జరుగుతుందని చెప్పారు. ఇక దీని బట్టి చూసుకుంటే విశాఖలో నిజంగానే కరోనా కేసులు తక్కువ ఉన్నాయని తెలుస్తోంది. రాజధాని తరలింపు కోసం వైసీపీ కరోనా కేసులు దాచిపెడుతుందనే, టీడీపీ నేతలు చేసే విమర్శల్లో ఎలాంటి అర్ధం లేదని తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: