ప్రస్తుతం ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా టెస్టుల సంఖ్యని పెంచాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం.... దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లని దిగుమతి చేసుకుంది. అయితే ఈ కిట్లలో వైసీపీ ప్రభుత్వం కమిషన్ నొక్కేసిందని టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఛత్తీస్ ఘడ్ ఇవే కిట్లని రూ.337 ప్లస్ జీఎస్టీకి కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనుగోలు చేసిందని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలకు వైసీపీ ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చి, తాము కొనుగోలు చేసే ముందే, ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు ఇస్తే, తాము అదే ధర చెల్లిస్తామని చెప్పామని అంటుంది.

 

ఇక దీనిపై ప్రభుత్వం క్లారిటీగా ఉన్న, వైసీపీ నేతలు ముందులో కాస్త అనుమానం కలిగేలా మాట్లాడారు. దాని వల్లే కమిషన్ ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీ నేతలు, గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిదానిలోనూ కమిషన్ నొక్కేసిందని అంటున్నారు. వరదలు, తుఫాన్ల సహాయంలో, పుష్కర ఘాట్ల నిర్మాణంలో, జన్మభూమి కమిటీల పేరుతో, దోమలపై దండయాత్ర అంటూ, ఎలుకలని పట్టడానికి కోట్లు ఖర్చు పెట్టడం, అమరావతి, పోలవరం నిర్మాణం పేరుతో, ఇలా చెప్పుకుంటే టీడీపీ నేతలు ప్రతిదానిలో కమిషన్ నొక్కేసారని అంటున్నారు. అందుకే ప్రజలు కూడా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని చెబుతున్నారు.

 

మళ్ళీ ఈ ఆరోపణలకు టీడీపీ  నేతలు కౌంటర్లు ఇస్తూ, తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఐదేళ్లు పారదర్శకంగా పాలన అందించామని, ఇప్పుడు వైసీపీ నేతలు అన్నింటిలో కమిషన్ లేపేస్తున్నారని విమర్శించారు. వైసీపీ వాళ్ళు కూడా అవినీతి వ్యాఖ్యల్ని ఖండిస్తూ, తమ సీఎం జగన్ పారదర్శకమైన పాలన చేస్తున్నారని చెబుతున్నారు. ఇక వీరి వ్యాఖ్యల్ని చూస్తున్న న్యూట్రల్ వ్యక్తులు, అవునులే ఎవరికీ ఏమి తెలియదు, అందరూ పారదర్శకంగానే పాలించారని సెటైర్లు వేస్తున్నారు. ప్రతి ప్రభుత్వంలోనూ ఈ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: