విశాఖ రాజధాని అని వైసీపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే అనేక అడ్డంకులు, అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. నిజానికి ఈ పాటికి జగన్ విశాఖ నుంచే పాలన సాగించాల్సి ఉంది. కానీ ముందే చెప్పుకున్నట్లుగా శాసనమండలితో మొదలైన కధ అలా సాగి స్థానిక ఎన్నికల దాకా ఆ తరువాత క‌రోనా దాకా వచ్చేసింది. ఈ దశలో మళ్ళీ రాజధాని ప్రస్తావన వస్తోంది.

 

నిజానికి జగన్ కి అయితే విశాఖకు వెంటనే వెళ్ళిపోవాలని ఉంది.విశాఖ నుంచి పాలన సాగించాలని ఉంది. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం, మార్చి 25 ఉగాది రోజుల అక్కడ నుంచే పేదలకు ఇళ్ళ  పట్టాలను పంపిణీ చేయాలనుకోవడం జగన్ యాక్షన్ ప్లాన్ గా నాడు ఉంది. కానీ అంతా ఒక్కసారిగా తల్లకిందులైంది. కరోనా మహమ్మారి జగన్ ప్లాన్ ని ఒక్కసారిగా మార్చేసింది.

 

అయినా సరే రాజధానిగా విశాఖను చూడాలని జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దానికి తగిన కసరత్తు కూడా మొదలుపెడుతున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి చాలా రోజులుగా  మకాం అందుకో భాగంగానే చూడాలి. ఇవన్నీ ఇలా ఉంటే విజయసాయిరెడ్డి సైతం విశాఖ రాజధాని ప్రతిపాదనను ఎవరూ ఆపలేరని మళ్ళీ మళ్ళీ గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో రెండవ ఆలోచన లేనేలేదని కూడా ఆయన అంటున్నారు.

 

ఇక ఇంకో వైపు చూసుకుంటే మే 28న విశాఖకు సచివాలయం తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. కరోనా వల్ల ఈ ఏడాది ఎకాడమిక్ ఇయర్ కూడా మారుతుందని, అందువల్ల ఈ లోగా సచివాలయం ఉద్యోగులను విశాఖకు షిఫ్ట్ చేసి కొత్త విద్యా సంవత్సరం నాటిని అక్కడ నుంచే కార్యకలాపాలు మొదలెట్టాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. 

 

మరి దీనికి కరోనా మహమ్మారి బ్రేకులు వేయకుండా ఉండాలి. మే 3వ తేదీతో లాక్ డౌన్ పూర్తి అయితే ఆ తరువాత రాజధాని కధను ముందుకు తీసుకువెళ్ళాలని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: