కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు కొత్తగా పుట్టుకొస్తున్న వార్తలు మనకందరికీ తెలిసినదే. కామన్ గా ఈ వైరస్ వల్ల ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తే ఆర్థిక మాంద్యం మరియు నిరుద్యోగం అదేవిధంగా ఆహారం. అయితే తాజాగా కరోనా వైరస్ దెబ్బకి పెట్రోల్ మరియు డీజిల్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ వల్ల ప్రపంచం పెను సవాల్ ఎదుర్కోబోతున్నట్లు తాజాగా సరికొత్త వార్త అంతర్జాతీయ స్థాయిలో వస్తుంది. కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో భాగంగా చాలా దేశాలు లాక్ డౌన్ విధించడం జరిగాయి. అడుగు తీసి అడుగు బయటకు వేసే ప్రసక్తి లేదు, అదే విధంగా రోడ్డుపై ఎటువంటి వాహనాలు కూడా తిరిగే ఛాన్స్ లేదు.

 

ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చమురు కంపెనీలో కలలో కూడా ఊహించని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ దెబ్బకి చమురు ధరల మీద పెద్ద ప్రభావం చోటు చేసుకుంది. చమురు వాడకం ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా తగ్గిపోవటంతో జూన్ లో ఫ్యూచర్స్ కు సంబంధించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడూ లేనట్లుగా మైనస్ లోకి వెళ్లిపోవటం అందరినీ కలవరపెడుతోంది. క్రూడాయిల్ వినియోగం తగ్గిపోవడంతో నిల్వలు భారీగా పెరిగిపోయాయి. డిమాండ్ తగ్గిపోవటంతో ఉత్పత్తి ఎంత తగ్గించిన వినియోగం లేకపోవడంతో క్రూడాయిల్ రంగం కుదేలు అయ్యే పరిస్థితి ఉందన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తుంటే భవిష్యత్తులో చమురు వినియోగం అంత డిమాండ్ ఉండదన్న మాట వినిపిస్తోంది.

 

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా రోజుకో విధంగా మారుతుండటం తో రాబోయే రోజుల్లో వీటి ధరలు కూడా పడిపోయే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. ప్రభుత్వాలకు మద్యం నుండి ఏ విధమైన లాభాలు వస్తాయో... అదే స్థాయిలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా కూడా లాభాలు వస్తాయి. లాక్ డౌన్ కారణంగా రోడ్లపైకి వాహనాలు రాకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయిల్ విషయంలో రానున్న రోజుల్లో ప్రపంచంలో పెను సవాల్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: