ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . అయితే భారత దేశం కరోనా ను నుంచి తరిమి కొట్టేందుకు డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి మరి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సోకితే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కారణం వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. వైద్య ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కలియుగ దైవం గా మారిపోయారు వైద్యులు. మృత్యువుని ముందుంచుకుని కూడా పోరాటం చేస్తూ మనుషుల ప్రాణాలు బతికేస్తున్నారు. ఇలా మనుషుల పునర్జన్మనిస్తూ  దేవుడు గా మారిన డాక్టర్లకు ఎంతో గౌరవం ఇవ్వాలి .. కానీ కొన్నిసార్లు మాత్రం డాక్టర్లకు కనీసం మర్యాద దక్కడం లేదు. 

 

 బ్రతికున్నప్పటికంటే చనిపోయిన తర్వాత కూడా డాక్టర్లకు కనీస మర్యాద ఇవ్వడం లేదు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే మరింత నీచంగా మారింది పరిస్థితి. అక్కడ కరోనా వైరస్ రోగులకు వైద్య చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కనీస మర్యాద కాదు కదా.. అసలు వాళ్ళని మనుషుల్ల కూడా చూడడం లేదు అక్కడ ప్రజలు. అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన... వైద్యులతో పాటు అదే రాష్ట్రానికి చెందిన వైద్యులు కూడా కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. 

 

 అయితే తాజాగా కరోనా  పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులు కరోనా  వైరస్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన చనిపోయిన తరువాత తమ ప్రాణాలను కాపాడడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఆ డాక్టర్ ని  గౌరవించాల్సిందే పోయి.. అంత్యక్రియలు కూడా చేయనటువంటి నీచ సంస్కృతి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దీనిపై విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైద్యుల  పరిస్థితి మరీ ఇంత దీనంగా  ఉన్నప్పుడు అసలు బాధ్యతగా లేనిది ప్రభుత్వంకా  లేకపోతే అధికారులకా  అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. వృత్తి నిర్వహణలో భాగంగా బాధ్యతగా డాక్టర్ ప్రాణాలను కాపాడుతుంటే తమిళనాడులో ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలాగా  ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: