ఏపీలో వైసీపీ సర్కారు పాలనపై విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అన్నాక ఇలాంటివి మామూలే. అయితే ఈ విపక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ ఎన్నికల ముందు వరకూ బద్ద శత్రువులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జగన్ పై కోపంతో.. టీడీపీ, బీజేపీ చేతులు కలుపుతున్నాయి. అధికారికంగా కాకపోయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ మాయలో పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

అదే కన్నా లక్ష్మీనారాయణ కరోనా కాలంలో జగన్ సర్కారు కొరియా నుంచి తెప్పించుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై లక్ష్మీనారాయణ ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలోనూ అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. చత్తీస్ గఢ్ 350 రూపాయలకే కిట్లు తెచ్చుకుంటే ఏపీ 700 రూపాయలు పైగా ఖర్చు చేస్తోంది.. ఈ గ్యాస్ సొమ్ము కమీషన్లుగా నొక్కేస్తున్నారా అంటూ కన్నా ప్రశ్నిస్తున్నారు.

 

 

అయితే ఇక్కడే కన్నా లక్ష్మీనారాయణ తప్పులో కాలేశారు. రూ.730 చొప్పున దక్షిణ కొరియా దేశం నుంచి ఏపీ ప్రభుత్వం లక్ష రాపిడ్‌ కిట్లు కొనుగోలు చేసిన మాట నిజమే. అయితే.. అంతకంటే ఎక్కువ ధరకు అనగా రూ.790 చొప్పున ఐదు లక్షల కిట్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఏపీ సర్కారును ప్రశ్నిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ.. ముందుగా సొంత పార్టీ బీజేపీని ప్రశ్నించగలరా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

ఇక ఇప్పుడు ఈ కిట్ల వ్యవహారంపై ఏమాత్రం డోసు పెంచినా అది.. అసలు వ్యవహారాన్ని బయటపెట్టి కేంద్రాన్నే దోషిగా నిలబెడుతుంది. మరి కన్నా లక్ష్మీనారాయణ మాత్రం కాణిపాకంలో ప్రమాణం చేస్తాను అంటూ శపథాలు చేస్తున్నారు. అంటే ఈ కిట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని భావిస్తే.. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యురాలు అవుతుంది. దోషి అవుతుంది. మరి కన్నా ఇంతకీ ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు.. ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: