కరోనా వైరస్ భారతదేశంలో ఉన్న కొద్దీ విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా గాని ఉన్న కొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దాదాపు నెల రోజులకు పైగానే లాక్ డౌన్ అమలవుతున్న దేశంలో పరిస్థితి కుదుట పడలేదు. ముఖ్యంగా ఢిల్లీ మత ప్రార్థనల కేంద్రంగా బయటపడిన కరోనా వైరస్ పాజిటివ్... కేసులు దేశంలో అనేకమందికి ప్రబలడానికి కారణం అయ్యింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనుకోని విధంగా పొరపాటున ఈ ఘటన జరగటంతో దేశవ్యాప్తంగా 40 శాతం కేసులు ఢిల్లీ మార్కస్ ప్రధాన కేంద్రంగా నమోదైన వారి వల్లే కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల చెప్పుకొచ్చింది. ఇటువంటి తరుణంలో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

 

ఆ రాష్ట్రాల జాబితా ఒకసారి చూస్తే ఉత్తరప్రదేశ్.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. కేరళ.. గోవా..పశ్చిమబెంగాల్ రాష్ట్రలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గోవాలో ఇప్పటివరకు ఒక పాజిటివ్ కేసు కూడా లేకపోవడంతో, గోవా లాక్ డౌన్ ను ఎత్తేయటంలో తప్పులేదు. కానీ మిగతా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఉన్నాగాని రాజకీయంగా ఆలోచిస్తూ ఆ రాష్ట్ర పరిపాలకులు లాక్ డౌన్ ను సడలిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

ఒక వ్యక్తి తప్పు చేసిన దేశం మొత్తం డేంజర్ జోన్ లో పడుతుందని... అలాంటిది ఇన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను సడలిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటే దేశం కొంప మునిగి పోతుందని... ఇప్పటిదాకా పాటించిన లాక్ డౌన్ వేస్ట్ అవుతుంది అని చాలామంది అంటున్నారు. ఈ రాష్ట్రాలపై కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని మరో పక్క కొంతమంది డిమాండ్ చేస్తూ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారతదేశం వల్లకాడుగా మారిపోయే అవకాశం ఉంది అంటూ మరికొంతమంది సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: