ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సింగపూర్ ను కూడా ప్రభావితం చేస్తుంది. రోజు రోజు కు కేసులు ఎక్కువ అవుతుండడంతో మే 4న ముగియాల్సిన లాక్ డౌన్ ను జూన్1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు అక్కడ 9125 కరోనా కేసులు నమోదు కాగా అందులో 11 మంది మృతి చెందారు. కాగా దక్షిణాసియా ,చైనా నుండి వస్తున్న వలస కార్మికుల వల్లే సింగపూర్ లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వం నిర్దారించింది. 
 
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 25లక్షల కరోనా కేసులు నమోదు కాగా ఒక్క యూఎస్ఏ లోనే 8లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దాదాపు 200 దేశాలకు  ఈవైరస్  విస్తరించింది. దీనికి విరుగుడు కనుక్కోవడానికి  పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ఆర్థికంగా కూడా చాలా దేశాలను ఈ వైరస్ చావు దెబ్బ తీసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలను ఆర్థిక సంక్షోభంలో పడేసింది. ఇప్పటికే నెల రోజుల లాక్ డౌన్ వల్ల ఇండియా.. లక్షల కోట్ల ఆదాయం కోల్పోగా మే 3వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగనుంది.
 
అటు లాక్ డౌన్ అమలు లో వున్న కూడా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. రోజు రోజు కి కేసుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 20000 కు పైగా కేసులు నమోదు కాగా అందులో 650మంది  చనిపోయారు. ముఖ్యంగా ముంబై ,ఢిల్లీ , రాజస్థాన్ , గుజరాత్ లలో ఈ వైరస్ ప్రభావం  ఎక్కువగా వుంది. ఒక్క మహారాష్ట్రలోనే 4000 కరోనా కేసులు నమోదు అయ్యాయి.  అయితే మిగితా దేశాల తో పోలిస్తే పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చెపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: