హాయిగా సాగిపోతున్న జీవనం.. అందమైన ప్రపంచం.. ఎవరికి వారు తమ జీవితంతో పోటాపోటీగా పోరాడుతున్న సమయం.. వయస్సుకు వచ్చిన వారు పెళ్లి కోసం కలలు కంటుండగా.. చదువులు ముగిసి జీవితంలో స్దిరపడని వారు విదేశాలకు వెళ్లి హాయిగా సెటిల్ అవుదామని ఆలోచనలతో ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఒక్క సారిగా అందరి ఆశయాలను, ఆశలను పాతాళానికి తొక్కేలా వచ్చింది కరోనా అనే వైరస్.. ఇది పుట్టింది చైనాలో అని ఇప్పటికే అందరికి తెలిసిందే.. ఈ విషయాన్ని సకాలంలో చైనా ప్రపంచదేశాలకు తెలియకుండా రహస్యంగా దాచిందనే విషయం ప్రచారంలో ఉంది..

 

 

ఇదే కాకుండా వూహన్‌లో ఈ వైరస్ తన ప్రతాపాన్ని భయంకరంగా చూపిస్తే గాని చైనాకు అర్ధం కాలేదనుకుంటా.. అప్పుడు చావుకబురు చల్లగా చెప్పింది.. అప్పటికే పరిస్దితులు చేయి దాటిపోయాయి.. ఇకపోతే ఈ వైరస్ సృష్టికి చైనానే కారణం అనే వాదన బలంగా వినిపిస్తుంది.. ఈ నేపధ్యంలో అమెరికా ఆ నిజాలను బయటపెట్టడానికి చైనాలో విచారణ చేపడతామని ప్రకటించగా అందుకు చైనా ఒప్పుకోలేదు.. సరికదా మమ్మల్ని దోషులుగా చూడకండి.. మేము కూడా మీలాగే భాదితులమని తమ మీద సానుభుతిని తామే చూపించుకుంది.. నిజానికి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చాటుకోవాలని చైనా ఎప్పటి నుండో ఆశిస్తుందన్న విషయం తెలిసిందే.. ఇందుకు గాను అతి సీక్రేట్‌గా జీవ రసాయనిక పరిశోధనలను సాగిస్తుందనే అభియోగం కూడా చైనాపై ఉంది..

 

 

ఇకపోతే కోవిడ్‌-19 అనే మహమ్మారి తొలుత ఆరోగ్య సంక్షోభంగా వెలుగులోకి వచ్చింది... అయితే రాను రాను దీని కారణంగా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఇది ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక అశాంతి, హింస చెలరేగే పరిస్థితులకు దారితీసేలా ఉంది.. అదీగాక ముందు ముందు బయో ఉగ్రదాడులకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు కొందరు.. ఇదిలా ఉండగా అమెరికా మాత్రం చైనాను దోషిగా నిలబెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది.. ఈ నేపధ్యంలో కరోనా వైరస్‌ కట్టడిలో కీలకమైన వ్యక్తిగత రక్షణ కిట్లు, మాస్కులను చైనా అక్రమంగా నిల్వ చేసుకుని ఇప్పుడు అధిక ధరలకు అమ్ముతోంది అనేందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని వైట్‌హౌస్‌ అధికారి ఒకరు ప్రకటించారు.

 

 

ఇందుకు గాను ఎక్కువ మోతాదులో మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొనుగోలు చేసిందని ట్రేడ్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ డైరెక్టర్‌ పీటర్‌ నవారో సోమవారం ఆరోపించారు. ఒకవైపు భారత్, బ్రెజిల్‌ వంటి దేశాల్లో తగినన్ని కిట్లు లేకపోగా చైనా మాత్రం వాటిని అక్రమంగా నిల్వ చేసిందని ఆరోపించారు. ఈ రకమైన అంశాల పై విచారణ జరిగి తీరాలని, అంతర్జాతీయ స్థాయిలో ఓ విపత్తు వచ్చినప్పుడు చైనా ఈ రకంగా ప్రవర్తించడం ఏమాత్రం సరి కాదన్నారు... ఏది ఏమైనా చైనా ప్రవర్తన వల్ల ముందు ముందు మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ అమెరికాతో పాటుగా మరికొన్ని దేశాలు ఆందోళన పడుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: