ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తరచూ హైదరాబాద్ నుంచి ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఆరోగ్య పరిస్థితిపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. కరోనాపై ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలో ఏపీ సర్కారుకు సలహాలు ఇస్తున్నారు. ఏపీ సర్కారు తీరుపై ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాం వైసీపీ నేతలకు ఏమాత్రం నచ్చడం లేదు.

 

 

చంద్రబాబు తాపత్రయమంతా మీడియాలో కనిపించాలని.. వైసీపీ సర్కారుపై బురద జల్లాలలనే తప్ప ఇంకేమీ కాదన్నది వారి అభిప్రాయం. తాజాగా వైసీపీ ఎమ్మల్యే రోజా అదే మాట చెబుతున్నారు. కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మెచ్చుకుంటున్నారు. కరోనాపై జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఈ రోజు దేశం మొత్తం ప్రశంసిస్తోందన్నారు.

 

 

కోవిడ్‌-19 టేస్టులలో కానీ, రేషన్‌ పంపిణీలో కానీ సీఎం జగన్‌ను అందరు అభినందిస్తున్నారన్నారు. అంతేగాక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆయనను అభినందించారని రోజూ గుర్తు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనపై విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్‌లో దాక్కున్న బాబు సలహాలు తమకు అవసరం లేదని, ముందు ఆయన కొడుకు లోకేష్‌కు సలహాలు ఇవ్వాలని రోజా ఎద్దేవా చేస్తున్నారు.

 

 

మరోవైపు చంద్రబాబు మీడియా సమావేశాలు అత్యంత బోర్ గా తయారవుతున్నాయి. గంటల తరబడి మాట్లాడటం అనే అలవాటును చంద్రబాబు ఇప్పటికీ మానలేకపోతున్నారు. చివరకు ఆయన మీడియా సమావేశాలను తెలుగుదేశం అనుకూల ఛానళ్లు కూడా ప్రసారం చేయడం మానేస్తున్నాయి.. పాపం.. చంద్రబాబు..అన్నట్టు తయారవుతోంది పరిస్థితి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: