ఈ జనరేషన్ పిల్లలు చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకొని వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు మరీ సెన్సిటివ్ గా తయారయ్యారు. తల్లిదండ్రులు తిట్టారని లేక మందలించారని, స్కూలులో టీచర్లు అరిచారనో ఇంకా ఇలాంటి సిల్లీ కారణాలతో ఏకంగా ప్రాణాలని తీసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటన తాజాగా గుంటూరు జిల్లాలో ఓ మైనర్ అమ్మాయి చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

 

ఒక పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడి గ్రామానికి చెందిన స్నేహ స్మిత కి 14 సంవత్సరాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా నెల రోజుల నుంచి అతను తన ఇంట్లోనే ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని అందులో ఎప్పుడూ గేమ్స్ ఆడడం, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం ఇలా బాగా అలవాటు చేసుకుంది. అయితే ఈ విషయంపై తల్లిదండ్రులు ఫోన్ ఎక్కువ వాడొద్దని, చూడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వారి తల్లిదండ్రుల మాట పక్కన పెట్టింది. అయితే సోమవారం ఉదయం ఆ బాలిక ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న విషయాన్ని చూసి తన తల్లి ఝాన్సీ రాణి మందలించి ఫోన్ ని లాక్కుంది.


ఇంత చిన్న విషయానికి మనస్థాపానికి గురై బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తల్లి నీ కూతురిని ఫ్యాన్ కు వేలాడటం చూసి ఆ వెంటనే విషయాన్నీ పోలీసులకు సమాచారం అందజేసింది. ఇంతటితో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: