ఒకవైపు కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే ఇంకోవైపు ఇల్లు ఖాళీ చేయలేదని ఇంట్లో ఉన్న వారిపై దాడులు కొనసాగుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఇల్లు ఖాళీ చేసే విషయం సంబంధించి చెలరేగిన వివాదంలో దంపతులపై దాడి జరిగింది. దీనితో సదరు దంపతులు పోలీస్ స్టేషన్లో తమ యజమాని తమపై దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ సంఘటన అనంతపూర్ జిల్లా గుత్తి లో చోటు చేసుకుంది. గుత్తి నగరంలోని ఆర్ ఎస్ ఎం ఆర్ రోడ్ లో తిరుమల రెడ్డి ఇంట్లో ఉంటున్న గంగాధర్, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇందుకుగాను ప్రతి నెల ఓనర్ కి నాలుగు వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు కూడా...

 


అయితే మంగళవారం ఉదయం తిరుమల రెడ్డి ఇంటి అద్దె కోసం రావడంతో గంగాధర్ ఇచ్చాడు. అయితే తాను చెప్పిన విషయం మీరు ఇల్లు ఖాళీ చేయమంటే అసలు పట్టించుకోవడం లేదంటూ తిరుమలరెడ్డి అతడితో గొడవకు దిగాడు. అయితే తనకి వేరే మంచి ఇల్లు దొరకలేదని, దొరికితేనే త్వరలో ఖాళీ చేస్తామని గంగాధర్ జవాబిచ్చాడు. అయితే దీనికి ఇంటి ఓనర్ రెచ్చిపోయి తమపై దాడికి పాల్పడ్డారని ఆ దంపతులు గుత్తి పోలీసులకు ఫిర్యాదు అందించారు. అయితే ప్రస్తుతం వీరు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దంపతులు ఇచ్చిన ఫిర్యాదుపై వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


అయితే తనకి ఈ విషయంలో ఎలాంటి గొడవలు లేవని కేవలం ఇల్లు ఖాళీ చేయమని ఐదు నెలలుగా చెబుతున్న వారు తమ విషయాన్ని పట్టించుకోవట్లేదని యజమాని తిరుమలరెడ్డి చెప్పుకొచ్చాడు. సొంతింటికి మేము మారాలని అనుకున్న అని చెప్పిన గంగాధర్ దంపతులు ఆ విషయాన్ని పక్కన పెట్టారని చెబుతున్నాడు. అయితే ఈ నెలలో వారు ఖాళీ చేస్తానని చెప్పిన ఖాళీ చేయకపోవడంతో వారిని నిలదీశానే తప్ప ఎలాంటి దాడి చేయలేదని యజమాని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: