అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు భారత ప్రభుత్వం అమెరికా దేశానికి హైడ్రోక్సీక్లోరోక్విన్ పంపిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనికోసమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మందును అమెరికాకు పంపకపోతే ప్రతికారం ఉంటుందని దాకా పోయే విధంగా చేసి భారత్ నుంచి హైడ్రోక్సీక్లోరోక్విన్ ని అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి చేసుకున్నాడు. నిజానికి హైడ్రోక్సీక్లోరోక్విన్ అనేది మలేరియా మందు. అయితే ఈ మెడిసిన్ తో పాటు అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ కలిపి వాడితే  కరోనా వైరస్ మటుమాయం అవుతుందని అప్పట్లో తెలిపారు.

 


అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారు అయిందని చెప్పవచ్చు. కరోనా వైరస్ రోగం కుదుట పడడంతో ఏమో కానీ అమెరికా అంటువ్యాధులు విభాగం నియమించిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ అసలు వాడకూడదని సిఫార్సు చేసింది. ఇది కేవలం అవసర పరీక్షలకు తప్పించి మరి దేనికి వాడకూడదని ఆ నియమించిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది.

 


అయితే ఇందుకు కారణం ఈ మందు పరిణామాలు హైడ్రోక్సీక్లోరోక్విన్ లేదా మరో క్లోరోక్విన్ వాడకం ద్వారా ఏమి జరగడం లేదని తెలిపింది. ఈ విషయంపై అటు అనుకూలంగానూ లేదా ఇటు వ్యతిరేకంగా ఎటువైపు చెప్పడానికి సమాచారం లేదని కమిటీ చివరికి పేర్కొంది. ఒకవేళ ఆ మందు వేసినట్టయితే ప్రతికూల ప్రభావాల కోసం పేషెంట్ ని మరోసారి పరిశీలించాలని గట్టిగా చెప్పుకొచ్చింది. అయితే ఈ కమిటీని అమెరికా అధ్యక్షుడు సలహాదారుడు ఆంటోనీ నియమించడం జరిగింది. అయితే అమెరికాలోని ఒక పత్రికలో మంగళవారం ప్రచురించిన దాని పరంగా అమెరికా వెటరన్స్ అఫైర్స్ హాస్పిటల్లో రోగులకు హైడ్రోక్సీక్లోరోక్విన్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు కలగకపోగా అధిక మరణాలు సంభవిస్తున్నాయని చెప్పడం విశేషం. అయితే ఈ విషయంపై మరింత లోతైన పరిశోధనలు జరగాలని అక్కడ పాల్గొన్న నిపుణులు, పరిశోధకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: