ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ ఎంత అల్లకల్లోలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద 25 లక్షలకు పైగా జనాలు ఈ వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ వ్యాధి సోకి 175000 పైగా మరణాలు సంభవించాయి ఇప్పటివరకు. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచ దేశాల్లో చాలావరకు ఇప్పటికీ లాక్ డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

ISO DRONE FISHING 🎣 When you’re being responsible and staying at home but the fish are calling! (The fish was undersize so we released it back) #isolation #drone #fishing #dronefishing #catchoftheday #catchandrelease #socialdistancing

A post shared by sam Romeo (@sam_romeo) on


లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఎక్కడికక్కడ వారి ఇళ్లలోనే ఉంటూ కాలాన్ని గడపాల్సి వస్తుంది. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సామ్ రోమియో కు ప్రతిరోజు నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూడడం, వర్కింగ్ ఫ్రం హోమ్ తో బిజీగా గడుపుతున్నాడు. అయితే అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. మామూలుగా తను నివసించే ప్రాంతం బీచ్ కు చాలా సమీపంలో ఉంటుంది. దీనితో తనకి ఇంట్లోనే ఉండి చేపట్టాలనే ఆలోచన తలుపుతట్టింది.


చేపలు పట్టడం పెద్ద సంగతి అనుకుంటున్నారు కదా అయితే అందరి లాగా కాకుండా డ్రోన్ తో చేపట్టాలనుకొన్నాడు సామ్. అనుకున్నదే తరవాయిగా సామ్ రోమియో డ్రోన్ ను తన ఇంట్లో నుంచి సముద్రం పైకి పోనిచ్చాడు. అయితే డ్రోన్ ఆపరేట్ చేసి మొత్తానికి చేపని పట్టాడు సామ్. ఆ తర్వాత నాకు బోర్ కొట్టి డ్రోన్ తో చేపలు పట్టడం నా లక్ ఎలా ఉందో పరీక్షించుకోవాలి అనుకున్నా అని మొత్తానికి దొరికింది అని అంటున్నాడు సామ్.


అయితే అతనికి ఆ చేపలు పట్టేందుకు 30 నిమిషాలు సమయం పట్టిందట. అయితే ఆ సమయంలో సామ్ డ్రోన్ కు రెండు బ్యాటరీలు మార్చాల్సి వచ్చింది. ఓ మై గాడ్ నిజానికి ఇది సాధ్యమవుతుందని అనుకోలేదని నెటిజన్ కామెంట్ చేయగా.... నీవు 3020 సంవత్సరంలో ఉన్నావు అంటూ మరో పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: