ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని  కబలిస్తోంది. ఎటు నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎలా దాడి చేస్తుందో తెలియదు కానీ వస్తే మాత్రం దాదాపుగా ప్రాణాలను హరించుకు పోతుంది అనే భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కేవలం ఈ మహమ్మారి వైరస్ ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుని గజగజ వణికిస్తుంది ఈ మహమ్మారి కరోనా వైరస్.దీంతో ప్రపంచ దేశాలు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. అయితే కరోనా వైరస్  భయం ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం విధులు నిర్వహించక తప్పడంలేదు. 

 

 

 ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు డాక్టర్లు పోలీసులు కరోనా ద్వారా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అయితే కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు డాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా  వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు అయితే బాడీ మొత్తం కవర్ అయ్యేలా ఒక సూట్  ధరించి వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏ హాస్పిటల్లో చూసిన కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఇలాంటి ఒక సూట్ ధరించి కనిపిస్తున్నారు. అయితే పైన ఫోటోలు ఒకసారి లుక్కేయండి వాళ్ళు అచ్చం డాక్టర్లు వేసుకున్నట్లు కానీ సూట్ ధరించి ఉన్నారు కదా. 

 

 

 అవును డాక్టర్లు కదా మరి పెట్రోల్ బంక్ లో ఏం చేస్తున్నారు అంటారా... వాళ్ళు  డాక్టర్లు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే... కరోనా  వైరస్ నుంచి రక్షణ కోసం సూట్ వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లు కాదు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఏంటి అవాక్కయ్యారా... అయినా ఇది నిజమే... విజయవాడలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ బంక్ సిబ్బంది ఇలాంటి సూట్ ధరించి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మామూలుగా పోలీసులు అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలను ఇంటిపట్టునే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసు వాహనాలు రెడ్ అలెర్ట్  ఉన్న ఏరియాల్లో కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అవి తిరిగి పెట్రోల్ బంక్ లోకి వస్తూ ఉంటాయి. మరి అలాంటి వాహనాలు పెట్రోల్ బంక్ లోకి వచ్చినప్పుడు పెట్రోల్ బంక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే కదా. అందుకే వినూత్న ఆలోచన చేసి  పెట్రోల్ బంక్ లో పని చేసే సిబ్బందికి తల  కూడా కాళ్ల వరకూ పూర్తిగా కవర్ అయి ఉండేలా దుస్తుల సమకూర్చారు. అంతేకాకుండా మాస్కులు గ్లౌజులు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైసర్లు  కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది అందుబాటులో ఉంచారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: