ప్రపంచం మొత్తంల కరోనా మహమ్మారి గందరగోళంలో పడిపోయింది... రోజూ చావులు, కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  దేశంలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో సామాన్య ప్రజలు.. అత్యంత బీదరికం అనుభవిస్తున్నవారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  కానీ ఏపిలో రాజకీయాలు మాత్రం ఇవేవీ పట్టనట్టుగా నడుస్తున్నాయి.  కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య వాగ్వాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.  కన్నాపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని అన్నారు. కన్నాపై జరుగుతున్న దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడగాల్సిన  స్థాయిలో ఉందని చెప్పారు. 

 

రెండు, మూడు రోజులుగా ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు మీరు మాత్రమే ఉన్నారా.. ప్రజలు అంతా చూస్తున్నారు.. ఇలా అయితే ఛీత్కరిస్తారు.. తరిమి కొడతారని అన్నారు.  ప్రపంచాన్ని కరోనా వైరస్ ఆక్రమిస్తున్న కారణంగా అగ్ర రాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయని, వాటి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందని అన్నారు. మన దేశంలో లక్షలాది మంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊర్లో ఉంటూ, అర్ధాకలితో అలమటిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

రైతన్నలు పంటలు చేతికొచ్చిన వాటిని ఏం చేసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏపీపై కూడా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని అన్నారు. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు.  ఇదీ తీవ్రమైన పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు వేలెత్తి చూపుతున్నారు.. గుడికి వెళ్లి ప్రమాణాలు చేద్దాం అంటున్నారు.. ఇది ఎంత వరకు న్యాయం అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా రక్కసి వదిలిపెట్టి పోయేంత వరకు చిల్లర రాజకీయాలను దూరంగా పెడదామని పవన్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: