ప్రపంచవ్యాప్తంగా కరోనా  సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఈ మహమ్మారి వైరస్ ఎఫెక్ట్ ఉంది. ఇక అగ్రరాజ్యాలలో  అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడి ప్రజలందరూ రేపొ  మాపో  అన్నట్లుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు  కరోనా  వైరస్ బారిన పడుతుండటం తో... మరింత భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. అసలు ఈ మహమ్మారి వైరస్ ను తట్టుకొని... బతికి బయట పడతామా  లేదా అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా కరోనా  వైరస్ కట్టడికి కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ముఖ్యంగా ఆయా దేశాలు స్వీయ  నిర్బంధంలోకి వెళ్ళిపోయి  లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్బంధం సమయంలో ధనవంతులు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నిరుపేదల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్షోభం సమయంలో ఆయా దేశాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా జపాన్ ప్రధాని షింజో అబే భారీ ఆర్థిక ప్యాకేజీని అక్కడి ప్రజలకు ఆదుకోవడానికి ప్రకటించారు. దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో లక్ష యెన్ లు  అంటే మన రూపాయల్లో  70 వేల రూపాయలకు సమానం ఆర్థిక సాయం అందించనున్నాము అంటూ ఆయన ప్రకటించారు. 

 

 

 ప్రతి ఇంటికి రెండు మాస్క్ ల  చొప్పున పంపిణీ చేస్తామని... అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీని పొడిగించినట్లు ప్రధాని ప్రకటన చేశారు. వచ్చే నెల లోపు అందరూ ఖాతాల్లో నగదు జమ చేస్తాము  అంటూ జపాన్ ప్రధాని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఆదాయాలు కోల్పోయిన అన్ని కుటుంబాలకు మూడు లక్షలయెన్ ల  ఆర్థిక సాయం అందిస్తామని... ప్రకటన చేయడంతో ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం కరోనా  వైరస్ వల్ల నష్టపోయిన వారికి మాత్రమే కాకుండా అందరికీ ఇవ్వాలని సొంత పార్టీ నుంచి డిమాండ్లు రావడంతో ప్రతి ఒక్కరికి లక్ష్య యెన్ ల ఆర్థిక  సహాయం చేస్తామని తాజా ప్రకటన చేశారు జపాన్ ప్రధాని.

మరింత సమాచారం తెలుసుకోండి: