ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 56 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 203 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 813కు చేరగా 120 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. 
 
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికార వైసీపీ నేతలు కబ్జా పర్వానికి తెరలేపుతున్నారు. తిరుపతి స్విమ్స్ అధికారులు క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తకు అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్న క్యాంటీన్ ను మూసివేశారు. ఈ వ్యవహారంపై క్యాంటీన్ నిర్వాహకుడు మీడియాతో మాట్లాడుతూ తన క్యాంటీన్ ను అధికారులు బలవంతంగా మూసివేయించారని చెప్పాడు. తన వద్ద 40 మంది పని చేస్తున్నారని వారిని కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో రోడ్డున పడేయటం సబబు కాదని చెప్పారు. 
 
తనకు మరో రెండు నెలల పాటు క్యాంటీన్ ను నిర్వహించుకునేలా అగ్రిమెంట్లు ఉన్నా రహస్యంగా టెండర్లు పిలిచి వైసీపీ కార్యకర్తకు క్యాంటీన్ ను అప్పగిస్తున్నారని తెలిపారు. తాను నెలకు 9.30 లక్షలు కడుతున్నానని... అయినా నాలుగున్నర లక్షల రూపాయలకు అప్పగించనున్నారని చెప్పారు. ఈ కబ్జా పర్వం గురించి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
మరోవైపు రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోనే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలు, గుంటూరు, నెలూరు, కృష్ణా జిల్లాలలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 65 శాతం కేసులు ఈ నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అధికారులు తీసుకుంటున్న చర్యలు, ప్రజల సహకారం వల్లే ఈ రెండు జిల్లాలలో కేసులు నమోదు కాలేదు.         

మరింత సమాచారం తెలుసుకోండి: