నిజమే, ఇపుడు ఈ దేశంలో పనిచేస్తున్నది కొంతమందే. చాలా తక్కువ శాతం మందే పనిలో ఉన్నారు. వారు కూడా బాధ్యతాయుతమైన విధులను నిర్వహిస్తున్నారు. మిగిలిన వారంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. ఖాళీ బుర్ర చాలా డేంజర్. అందుకే ఇపుడు ఏపీ రాజకీయాల్లో కూడా డేంజర్ సిగ్నల్స్ పడిపోతున్నాయి.

 

ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఠంచనుగా ప్రతీ రోజూ మీడియా  ముందుకువచ్చేస్తున్నారు. వచ్చినది లగాయితూ జగన్ని పట్టుకుని తిట్టడమే పెట్టుకుంటున్నారు. బాబు ఉంటున్నది పొరుగూరు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీ గురించి మాట్లాడుతున్నారు. పైగా ఆయన జాతీయ పార్టీ ప్రెసిడెంట్. ఆ సంగతిని కూడా మరచిపోయారు. జగన్ని తిట్టే దాన్నిలో ఒక శాతమైనా కేసీయార్ కి కరోనా కట్టడికి బాబు సూచిస్తే బాగుంటుందేమో. కానీ అలా చేయలేరు అనేస్తున్నారు వైసీపీ నేతలు

 

ఎందుకంటే బాబు సీనియర్ సిటిజన్ గా అక్కడ  ఉంటున్నారుట. కేసీయార్ ఏలుబడిలో ఉంటున్న కోట్లాది  పౌరులలో బాబు కూడా ఒకరు అంటున్నారు వైసీపీ నేతలు. నిజానికి బాబు జాతీయ నాయకుడు కాబట్టి కనీసం తెలంగాణాకు, వీలైతే తమిళనాడుకు, కర్నాటకకు, కేరళకు కూడా సూచనలు ఇవ్వవచ్చు. ప్రధాని ఫోన్ చేశారు కాబట్టి కేంద్రానికి కూడా సూచనలు చేయవచ్చు.

 

కానీ బాబులో అక్కసు ఉన్నట్లుంది, అందుకే జగన్నే పట్టుకుని తిడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా అయితే ఊరుకోకుండా రెచ్చిపోయారు. టీడీపీ నేతలకు తిన్నది అరగడంలేదని అంటున్నారు. ఇంటి పట్టున ఉండి హాయిగా రెస్ట్ తీసుకుంటూ కూడా కరోనా కట్టడికి  జగన్ పడుతున్న కష్టాన్ని చూసి ఓర్వలేక నిందలు వేస్తున్నారని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే తిన్నది అరగడం లేకపోవడం కూడా కరోనా వల్లనే వచ్చింది. ఇంకా చాన్నాళ్ళు ఇలాగే ఉంటే ఈ కేసులు పెరిగిపోతాయేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: