రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి వరకు టిడిపి వర్సెస్ వైసిపి అన్నట్టుగా నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా, హఠాత్తుగా ఈ వివాదంలోకి ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చి చేరారు. కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన కన్నా కరోనా కిట్లు కొనుగోలు విషయంలో ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అంటూ టీడీపీ కి కోరస్ గా మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు వైసీపీకి ఆగ్రహం కలిగించింది. ఇక అప్పటి నుంచి వైసీపీ వర్సెస్ 'కన్నా' అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శ లో ఎక్కడ బిజెపి ప్రస్తావన తీసుకు రాకుండా, కేవలం కన్నా లక్ష్మీనారాయణను వ్యక్తిగతంగానే టార్గెట్ చేసుకుంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. 

 

IHG


వాస్తవంగా బీజేపీ కి వైసీపీ కి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. బిజెపి అధిష్టానం వైసీపీ విషయంలో సానుకూలంగా ఉండడమే కాకుండా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు పలుకుతూ అండగా నిలబడుతోంది. ఈ సమయంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను వైసిపి నాయకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది చాలా మందికి ప్రశ్నగా మారింది. మొదట్లో వైసిపి కి కన్నా మద్దతుగా ఉండేవారు. అయితే కొద్ది నెలలుగా ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేంద్ర బిజెపి పెద్దల అనుమతి లేకుండానే సొంతంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలకు బీజేపీ కేంద్ర పెద్దలు మద్దతు పలుకుతున్నా, ఏపీ లో మాత్రం అవే అంశాల పై కన్నా, ఆయన వర్గం విమర్శలు చేస్తూ ఉండటం గత కొంత కాలంగా గందరగోళంగానే ఉంది. 


ఇక ఏపీ బీజేపీ కూడా రెండు మూడు గ్రూపులుగా విడిపోయింది. ఈ నేపథ్యంలోనే వైసిపి ప్రధానంగా 'కన్నా'ను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకువెళ్లి పొత్తు పెట్టుకోవడానికి కారణం కన్నా లక్ష్మీనారాయణ అని వైసిపి చాలా కాలంగా గుర్రుగా ఉంది. అలాగే... టిడిపి అధినేత చంద్రబాబు కనుసన్నల్లో కన్నా పనిచేస్తూ ఉండటం, వైసీపీకి ఆగ్రహం కలిగిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కన్నా వైఖరిపై కేంద్ర బిజెపి పెద్దలు కూడా గుర్రుగానే ఉన్నట్టుగా సమాచారం. 


అసలు చాలాకాలంగా నే కన్నాను ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. కన్నా వైఖరిపై బీజేపీ పెద్దలకు కూడా అంత సానుకూల అభిప్రాయం లేకపోవడంతో ఆయనను మార్చాలనే అభిప్రాయానికి వచ్చేశారు. అయితే అకస్మాత్తుగా ఈ కరోనా వ్యవహారం తెరమీదకు రావడంతో  కన్నా ఇంకా పదవిలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: