మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కిట్లలో కొట్టుడు అంటూ జగన్ ను ఉద్దేశించి ఒక వీడియో పోస్ట్ చేశారు. కరోనా కిట్లలో కూడా నొక్కుడు... బయట పడ్డ జగన్ స్కాం అనే టైటిల్ పెట్టి వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో " పది నిమిషాల్లో ఫలితాలు చూపే లక్ష కిట్లను సమకూర్చుకున్నామని... ఈ కిట్లతో పరీక్షలు చేసి ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా చేసుకుందామనేలా ఏపీ ప్రభుత్వం బిల్డప్ ఇచ్చింది. 
 
ముఖ్యమంత్రి ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారని... ఫలితం నెగిటివ్ వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖతో క్లాస్ కూడా పీకించుకున్నారు. కరోనా టెస్ట్ అంటే ఏమిటో తెలుసుకోండి..? ర్యాండమ్ టెస్టులు ఎవరికి చేయాలి...? ముఖ్యమంత్రికి కూడా వివరించండి అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఏపీ వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డికి మెసేజ్ పెట్టారు. 
 
కరోనా కిట్ల కొనుగోలులో జరిగిన అవినీతి వల్ల దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోందని... ఏపీ ప్రభుత్వం మొదట 1200 రూపాయలకు కిట్లు కొనుగోలు చేసిందని ప్రచారం జరగగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ 700 రూపాయలకు కిట్లను కొనుగోలు చేసినట్లు చెప్పిందని... జవహర్ రెడ్డి మాత్రం ఒక్కో కిట్ 640 రూపాయలకు కొన్నారని చెప్పారు. కానీ అసలు విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కిట్ 730 రూపాయలకు కొనుగోలు చేసింది. 
 
తీరా చూస్తే ఇవే కిట్లను ఛత్తీస్ గడ్ ప్రభుత్వం 337 రూపాయలకు, తమిళనాడు ప్రభుత్వం 600 రూపాయలకు కొన్నదని పేర్కొన్నారు. అంటే ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్ కు 393 రూపాయలు అదనంగా పెట్టింది. ప్రభుత్వం దాదాపు 8 కోట్ల రూపాయల అవినీతి చేసింది.  ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో తేలాల్సి ఉంది. ప్రభుత్వం జీవో ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన సోదరుడికి చెందిన కంపెనీ ఈ కిట్లకు కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిందని"  వీడియోలో  పేర్కొన్నారు. మరి ఈ వీడియో పట్ల వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: