ఏడు పదుల వయసు వచ్చినా తాను ఇంకా కుర్రవాడినే అన్న ఫీలింగ్ టీడీపీ అధినేత చంద్రబాబులో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే తరచుగా ఆయన తనకు వయసు పెరిగినా, కుర్రవాళ్ళకు ఏ మాత్రం తీసిపోనని, నా ముందు మీరందరూ ఎందుకు పనికిరారు అన్నట్టు గా చంద్రబాబు తరచుగా చెబుతూ ఉంటారు. బాబు ఎన్ని చెప్పినా ఆయన వయసు రిటైర్మెంట్ దాటిపోయింది. పార్టీ బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాల్సిన సమయం వచ్చేసింది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత టీడీపీ శ్రేణులకు కూడా ఈ విషయంలో నమ్మకం సన్నగిల్లి పోయింది. అసలు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏమిటి అనేది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి చంద్రబాబు యాక్టివ్ గానే ఉంటున్నా, ఎంతోకాలం రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు. 

 

IHG


ఇప్పటికిప్పుడు రాజకీయాల నుంచి తప్పుకునేందుకు, వేరొకరికి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. దీనికి కారణం తన తర్వాత పార్టీని ఆ స్థాయిలో సమర్థవంతంగా నడిపించగల నాయకులు ఒక్కరూ లేరన్నది చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఆ విషయాన్ని ఎక్కడా బయట పెట్టకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. పార్టీపై బాబు పట్టు కోల్పోతున్నారనే భావం పార్టీ శ్రేణుల్లో కనుక కలిగితే పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని, దీనివల్ల పార్టీ పుట్టి మునిగి పోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆ విషయం ఎక్కడా బయటపడకుండా తాను ఇంకా ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటానని, తన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, క్రమశిక్షణ ఇవన్నీ తన ఆరోగ్య రహస్యాలు అంటూ పదే పదే చెప్పుకుంటున్నాడు. 


 సోషల్ మీడియాలో మాత్రం బాబు రాజకీయ రిటైర్మెంట్ పై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇక జిల్లాల్లోనూ ఇదే రకమైన భావన ఏర్పడడంతో చంద్రబాబు ఈ ప్రచారం అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టిడిపి సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా కొన్ని రకాలైన పోస్టింగ్స్ ను పెట్టిస్తున్నారు. చంద్రబాబు వయసు 70 సంవత్సరాలు అయినా, ఆయనకు ఇంకా 20 ఏళ్ల పాటు ఎటువంటి డోకా లేదని చెబుతున్నారు. మోదీ వయసు కూడా మరో ఐదు నెలలు 70 సంవత్సరాలు అని,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 73 అని, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి వయసు 77 ఏళ్లు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వయసు 70 ఏళ్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు .వాళ్ళతో చంద్రబాబు పోల్చి చూసుకుంటే అప్పుడే రాజకీయ రిటైర్మెంట్ వయసు రాలేదని చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: