మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిపై చైనాపై ప్ర‌పంచ‌దేశాలు ముప్పేట దాడి చేస్తున్న నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో చేసిన ప్ర‌క‌ట‌న ఆ దేశానికి కాస్త సాంత్వ‌న క‌లిగిస్తోంది.డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫదేలా చైబ్‌ జెనీవాలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. జంతువుల నుంచి మనుషుల్లోకి వైరస్‌ ఎలా ప్రవేశించిందనే దానిపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. గబ్బిలాల నుంచి అది మానవుల్లోకి చేరి ఉండొచ్చని ఫదేలా చైబ్ అభిప్రాయపడ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్ల్యూహెచ్‌వో ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సాక్ష్యాల‌న్నీ కూడా క‌రోనా ల్యాబ్‌లో తయారు కావ‌డానికి ఆస్కారం లేద‌ని తేల్చుతున్నాయ‌ని అన్నారు.

 

 ప్రయోగశాలలో వైరస్‌ను ఉత్పత్తి చేశారన్న వాదనల్లో ఎంత‌మాత్రం నిజం ఉండ‌బోద‌ని వెల్ల‌డించింది. అన‌వ‌స‌ర‌మైన ఆరోప‌ణ‌లు..నిర‌ర్ధ‌క‌మైన వ్యాఖ్య‌ల‌తో ప్ర‌పంచ దేశాల మ‌ధ్య చీలిక ఏర్ప‌డ‌టం త‌ప్పా ఎలాంటి లాభం ఉండ‌ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. అయితే  చైనాలో గత ఏడాది చివర్లో జంతువుల నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచ‌నావేస్తోంది. ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్‌ను చైనాయే త‌యారు చేసింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వాదిస్తున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం ఒక అడుగు ముందుకేసి అమెరికా నుంచి కొంత‌మంది శాస్త్ర‌వేత్త‌ల బృందంచైనాలో ప‌ర్య‌టించ‌నుంద‌ని కూడా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.


ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో చైనా ప్ర‌జ‌లు భ‌గ్గుమ‌న్నారు. చేయ‌ని నేరానికి చైనాను అమెరికా ప్ర‌పంచ దేశాల ముందు దోషిగా నిల‌బెట్టేందుకు ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. అయితే చైనా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా వ్య‌వహార శైలిపై ఆచితూచినే స్పందిస్తూ వ‌స్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం చైనా త‌ప్పిదాలేన‌ని చెప్ప‌డం. ప్ర‌తిష్ఠ కోసం పోయి వ్యాధిని దాచ‌డం వ‌ల్ల ఇప్పుడు ప్ర‌పంచ మాన‌వాళికి ముప్పువాటిల్లే ప‌రిస్థితికి కార‌ణ‌మ‌య్యామ‌నే ఆత్మ‌శోధ‌న కూడా చైనాను వెంటాడుతున్న‌ట్లుగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అమెరికా ఎంత రెచ్చ‌గొట్టినా జిన్‌పింగ్ మాత్రం నోరుమెద‌ప‌క‌పోవ‌డం విశేషం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: