కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను కబళిస్తోంది. ఎంతో మంది ప్రజలను ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతికేలా చేస్తోంది. ఎన్నో కుటుంబాలు దుఃఖాన్ని  నింపుతుంది. మరెన్నో కుటుంబాలలో భయాందోళనలకు కారణమవుతుంది. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా  వైరస్ కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎన్ని  కఠిన నిబంధ అమలులోకి వచ్చినప్పటికీ... రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. దీంతో ఎన్నో కుటుంబాలు శోకసముద్రంలో మునిగి పోతున్నాయి. 

 

 

 అయితే తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన అందరినీ కలిచివేసింది. తాజాగా ఓ వైద్యురాలు  తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేసిన విజ్ఞప్తి  ప్రస్తుతం అందరి మనసులను కదిలిస్తున్నది . కరోనా  వైరస్ కారణంగా ఓ డాక్టర్ మృతి చెందగా అతని భార్య తన భర్త ఆఖరి కోరిక తీర్చాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి కి లేఖ రాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. న్యూరో సర్జన్ అయిన డాక్టర్ సైమన్ హెర్క్యులస్  విధినిర్వహణలో కరోనా  వైరస్ పేషెంట్లకు సేవలు  అందిస్తుండగా కరోనా  వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది పై స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో తన సహచరుడైన డాక్టర్ ప్రదీప్ కుమార్ అర్ధరాత్రి స్వయంగా తానే గొయ్యి తవ్వి పూడ్చిన  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే కరోనా  వైరస్ రోగులకు చికిత్స అందిస్తూ కరొన  సోకి తన భర్త డాక్టర్ సైమన్ హెర్క్యులస్ మరణించారని... తన భర్త చనిపోయే ముందు తనను ఓ చివరి కోరిక కోరాడు అని తెలిపింది. ఒకవేళ తాను కూడా ఈ ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్ బారినపడి చనిపోతే తమ సంప్రదాయాల ప్రకారం తన అంత్యక్రియలు  చేయాలని తన భర్త చనిపోయే ముందు తనను కోరినట్లు సదరు డాక్టర్ భార్య తెలిపింది. ఆయన మృతదేహాన్ని చెన్నైలోని కిల్  పార్క్  స్మశానవాటికలో కననం  చేయాలంటూ ముఖ్యమంత్రి పళనిస్వామిని కోరింది ఆమె. కరోనా  వైరస్  నియంత్రణలో ముఖ్యమంత్రి పళనిస్వామి సమర్థవంతంగా పని చేస్తున్నారు అంటూ తెలిపిన సదరు మహిళ... నా భర్త చివరి కోరిక నెరవేర్చండి అంటూ కోరుతూ వీడియోలో కంటతడి పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని కలిచి వేస్తుంది . తన భర్త మృతదేహాన్ని వెలికితీసి తమ మత విశ్వాసాలన మేరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ కోరింది. నా భర్త ఆఖరి కోరిక తీర్చండి  అంటూ వేడుకుంది సదరు మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి: