కరోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతుండ‌గా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,619 మంది కరోనాతో చనిపోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25.56 లక్షలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా 6.90 లక్షల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇలాంటి త‌రుణంలో చైనాకు షాక్ త‌గిలింది. క‌రోనా వైర‌స్‌ను క‌ప్పిపుచ్చి.. ప్ర‌పంచ‌దేశాల‌కు చైనా న‌ష్టాన్ని క‌లిగించింద‌ని అమెరికాకు చెందిన మిస్సోరి రాష్ట్రం కేసు వేసింది. చైనా ప్ర‌భుత్వంతో పాటు ఆ దేశ క‌మ్యూనిస్టు పార్టీపై అమెరికా కోర్టులో కేసు న‌మోదు అయ్యింది. 

 


క‌రోనా వైర‌స్ సృష్టిక‌ర్త చైనా అనే ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలో మిస్సోరి రాష్ట్రం కేసు వేసింది. ప్ర‌పంచ ‌దేశాల‌కు చైనా ప్ర‌భుత్వం అబద్దాలు చెప్పింద‌ని, విజిల్‌బ్లోయ‌ర్ల‌ను సైలెన్స్ చేసింద‌ని, వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో ఎటువంటి శ్ర‌ద్ధ చూప‌లేద‌ని మిస్సోరి రాష్ట్ర అటార్నీ జ‌న‌ర‌ల్ ఎరిక్ స్కిమిట్  తెలిపారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన చైనా బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయినందుకు,  మ‌నుషుల్ని ఇబ్బందికి గురి చేసినందుకు, తీవ్ర ఆర్థిక క‌ష్టాల‌ను క‌లిగించినందుకు తమ‌కు న‌ష్ట‌పరిహారం ఇవ్వాల‌ని మిస్సోరి రాష్ట్రం డిమాండ్ చేసింది. మిస్సోరి అధికారులు త‌మ న్యాయ‌ప‌రిహార కేసును చ‌రిత్రాత్మ‌కంగా వ‌ర్ణించారు. మిస్సోరి రాష్ట్రం వేసిన కేసులో అమెరికా ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నేప‌థ్యంలో అమెరికాపై ఆస‌క్తి నెల‌కొంది.

 

ఇదిలాఉండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. అత్యధికంగా యూఎస్‌ఏలో 45,318 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 24,648, స్పెయిన్‌లో 21,282, ఫ్రాన్స్‌లో 20,796, యూకేలో 17,337, జర్మనీలో 5,086, ఇరాన్‌లో 5,297, టర్కీలో 2,259, బ్రెజిల్‌లో 2,741, బెల్జియంలో 5,998, కెనడాలో 1,834, నెదర్లాండ్స్‌లో 3,916, స్విట్జర్లాండ్‌లో 1,478, స్వీడన్‌లో 1,765 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: