క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశంలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌న్ని మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే అమ‌ర్‌నాథ్ యాత్ర కూడా ఈఏడాది ర‌ద్దు చేయ‌బ‌డింది. ఈ మేర‌కు బుధ‌వారం అమ‌ర్‌నాథ్ యాత్ర బోర్డు మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. వాస్త‌వానికి ఈ ఏడాది జూలై23 నుంచి ఆగ‌స్టు 03వ‌తేదీ వ‌ర‌కు అమ‌ర్‌నాథ్ యాత్ర నిర్వ‌హించాల్సి ఉంది. కాని దేశం మొత్తం కోవిడ్‌-19తో బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు పేర్కొంది. అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు వెళ్లాల్సిన జ‌మ్మూలోని కొన్ని మార్గాలు రెడ్ జోన్ ప‌రిధిలో ఉన్న‌ట్లు తెలిపింది. 


ఇప్ప‌ట్లో క‌రోనా అదుపులోకి రాక‌పోవ‌చ్చు అన్న సందేహాల మ‌ధ్య ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే అమ‌ర్‌నాథ్‌లో చేప‌ట్టాల్సిన పూజా కార్య‌క్ర‌మాలు అతికొద్దిమంది వేద పండితులు, ఆచార్యుల మ‌ధ్య కొన‌సాగుతాయ‌ని జ‌మ్మ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌, అమ‌ర్‌నాథ్ యాత్ర బోర్డు చైర్మ‌న్ గిరీష్‌చంద్ర తెలిపారు. గ‌తేడాది భార‌త ప్ర‌భుత్వం  జ‌మ్మ‌క‌శ్మీర్లో  377 ర‌ద్దు చేయ‌డంతో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా యాత్ర‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు క‌రోనా వైర‌స్ కార‌ణంగా యాత్ర‌ను ర‌ద్దు చేయాల్సి రావ‌డంతో అమ‌ర్‌నాత్ భ‌క్తుల్లో నిరాశ వ్యక్త‌మ‌వుతోంది.


అయితే అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు సంబంధించి పూజా కార్యక్ర‌మాలను  టెలివిజ‌న్ చాన‌ళ్ల‌ల్లో వీక్షించేలా  ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. అమ‌ర్‌నాథ్ యాత్ర నిర్వ‌హించ‌డం అంటే వాస్త‌వానికి ఎంతో ప్ర‌యాస‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఇప్పుడున్న అసాధార‌ణ ప‌రిస్థితుల్లో బేస్ క్యాంపులు, వైద్య ఆరోగ్య‌శిబిరాల ఏర్పాటు, దేశ విదేశాల నుంచి భ‌క్త‌లకు అనుమ‌తి ఇవ్వ‌న్నీ కూడా సాధ్య‌ప‌డే విష‌యాలు కావని స్థూల‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వం యాత్ర ర‌ద్దుకే మొగ్గు చూపింద‌ని స‌మాచారం. వ‌చ్చే 15రోజుల్లో దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌డితే యాత్ర‌ను చేప‌ట్ట‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని కొంత‌మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: