భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఇండియన్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు.. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి నెల రోజులు దాటింది. మరి ఇప్పుడు మోడీ తదుపరి నిర్ణయం ఏంటన్నది వేచి చూడాల్సి ఉంది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో కాస్త వెసులు బాట్లు దక్కుతున్నా.. దేశం మొత్తం ఇంకా లాక్‌ డౌన్ ప్రభావంలోనే ఉంది. ముందు మూడు వారాలు ఉన్నారు.. ఆ తర్వాత ఇంకో రెండు వారాలు అన్నారు. మరి ఈసారి మోడీ ఏం చేస్తారో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

 

 

వాస్తవానికి మోడీ.. ఈ విషయంపై ఓ ప్రకటన అంటూ చేయాల్సి వస్తే.. అది లాక్ డౌన్ ముగింపు ఎత్తి వేత సమయంలో కానీ.. లేదా మరేదైనా ప్రకటన చేయాల్సి వస్తే అది కూడా లాక్‌ డౌన్ ముగిసిన తరవాతే ఉంటుంది. అయితే... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26 ఉదయం పదకొండు గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆ సందర్భంగా ఆయన దేశంలో కరోనా వైరస్ పరిస్థితి, లాక్ డౌన్ ఇబ్బందులు అన్నిటిని ప్రస్తావించవచ్చని అంతా ఊహిస్తున్నారు.

 

 

ఆయన మాటలను బట్టి ఆయన తీసుకోబోయే నిర్ణయాన్ని కాస్త అంచనా వేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈనెల ఇరవై ఏడో తేదీన ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలుతున్న తీరుతో పాటు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో రివ్యూ చేయొచ్చు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రధాని చర్చించొచ్చు.

 

 

మొన్న అలాగే వీడియో కాన్ఫరెన్సుల్లోనే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయంపై లీకులు ఇస్తూ వచ్చారు. మరి ఈసారి మన్ కీ బాత్‌ లోనూ.. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సుల్లోనూ మోడీ ఏం చెబుతారో అన్న ఉత్కంఠ దేశమంతటా నెలకొంది. మరి మోడీ ఏం చేస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: